Tuesday, April 23, 2024

అన్న క్యాంటిన్లు తీసివేయడం బాధాకరం : టీజీ భరత్‌

కర్నూలు : పేదల ప్రభుత్వం అంటూనే పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటిన్లు కొనసాగించకపోవడం బాధాకరమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి టి.జి భరత్‌ అన్నారు. బుధవారం నగరంలోని 4వ వార్డు కుమ్మరిగేరి నాలుగు రస్తాల వద్ద ఒక్క రోజు అన్న క్యాంటిన్‌ కార్యక్రమంలో టి.జి భరత్‌ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అన్న క్యాంటిన్‌ ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టారు. ఈ సందర్భంగా టి.జి భరత్‌ మాట్లాడుతూ.. తక్కువ ధరకే అన్నం పెట్టే అన్న క్యాంటిన్లు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారన్నారు. తాము ఏర్పాటు- చేస్తున్న అన్న క్యాంటిన్లకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. నగరంలోని ప్రతి వార్డులో ఒక్క రోజు ఈ అన్న క్యాంటిన్‌ ఏర్పాటు -చేస్తున్నట్లు- ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి-కై-నా రాష్ట్రంలో మళ్లీ అన్న క్యాంటిన్లు ప్రారంభించాలని కోరుతున్నట్లు- భరత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి ఊట్ల రమేష్‌, టిడిపి నేతలు కిరణ్‌, నరసింహ, రాజశేఖర్‌, భాష, కిట్టు-, నాగరాజు, మురళి, ప్రసాద్‌, అర్జున్‌, నారాయణ, గంగన్న, వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement