Wednesday, May 15, 2024

ఉపాసనతో చైతన్యశక్తి

ససగుణోపాసనతో సాధన ప్రారంభమయిన తరువాత అది నిర్గుణోపాసనకు దారి తీస్తుంది. నవ విధ భక్తి మార్గములలో ఆధ్యాత్మి క సాధకుడు ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ తుదకు దివ్యత్వ భావనను తనకుతానే అనుభ వి స్తాడు. దీనికి కఠోరమైన అభ్యాసన అవస రమని భావించడం సహజం. అయితే సాధ నలో చిత్తశుద్ధి అత్యంత అవశ్యము. దీనికి వైరాగ్య చింతన ఒక తప్పనిసరి స్థితి. గృహస్థ ఈ వైరాగ్య భావనను అలవర చుకోవడం అంత సులభమైనది కాదు. తనమీద ఆధారపడిన వారికి, సమాజా నికి భౌతిక వసతులు సమకూర్చే బాధ్యత గృహస్థ ముందు ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది. అందుకే గీతాచార్యుడు కర్మ లను అనుష్ఠించు ఫలితాన్ని తనకు వదిలి వేయమన్నాడు. ఇదికూడా అంత సులువైనది కాదు. అందుకే ఆధ్యాత్మిక జీవనాభిలాషులు సత్సంగము, సద్గ్రంధ పఠనము తప్పక చేయాలి. అప్పుడే ఉపాసనా మార్గము యొక్క రహస్యం అవ గతమవుతుంది. సగుణ బ్రహ్మము కంటె శ్రేష్ఠమైనదే అనంతమైన పరబ్రహ్మము.
తత: పరంబ్రహ్మ పరం బృహంతం
యథానికాయం సర్వభూతేషు గూఢమ్‌
విశ్వస్యైకం పరవేష్టి తారమీశం
తం జ్ఞాత్వామృతా భవంతి:
పరబ్రహ్మము అన్ని ప్రాణులలోను వాటివాటి ఉపాధి భారతను బట్టి దాగి ఉంటుంది. వాటి పరి మాణాన్ని బట్టి ఆ చైతన్యం వ్యక్తమవుతూ ఉంటుం ది. అదియే విశ్వవ్యాప్తమై ఉంటుంది.ఆ చైతన్యశక్తిని గుర్తించి అదియే పరమాత్మగా సాక్షాత్కరించుకున్న వారే ఏ ఆశ్రమంలోనున్నా అమరుడై నిలుస్తాడు. అటువంటివారే మహనీయులుగా వ్యక్తమవుతారు. అయితే సాధకుడు ఆ చైతన్యశక్తి రూపుని ఒక్క సగు ణ రూపంలో చూడడానికే ఇష్టపడతాడు. అయితే నిర్గుణ రూపుడు మాత్రమే అసలైన ముక్తిని ప్రసాది స్తాడు. సగుణారాధన అంటే నీ రూపం ఎలా ఉందో అదే రూపంలో మూర్తిని నిర్మించుకుని ఆరాధించ డం. అయితే ఈ సగుణ, నిర్గుణ మూర్తి రూపాలు సాధకుని భావనలో ఒకే సత్తకు చెందినవిగా ఉంటా యి. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తరు వాత కూడా సగుణ రూపాన్ని అనేక భక్తి మార్గాల్లో పూజించడం కనబడుతుంది. సకల ప్రాణులలోను నున్న పరమాత్మ యొక్క ఏకత్వాన్ని ఒక సత్యము గా గ్రహించినవారు సగుణారాధనలో తన్మయత్వా న్ని పొందడం చూసాము. అదే సచ్చిదా నందం. సంసార కారణమైన అజ్ఞానంవల్ల సాధకునికి సాక్షాత్కారం కలగదు. సకల అంధకారానికి అతీత మైన జ్ఞానజ్యోతియే పరమాత్మ. ఆయనను తెలుసు కున్నవారు అమరుడై మృత్యువుకు అతీతుడవు తున్నాడు. ఆ జ్యోతి రూపమైన పరమాత్మ పెనుచీకటికి అవతల ఉన్నాడు అని, అది నేనే సాక్షాత్కారించుకున్నానని జ్ఞానంతో తెలుసుకుంటాడు. ఆ పరాత్మను మించి నది ఏదీలేదు. అత్యంత సూక్ష్మము, గరి ష్టమైనది రెండూ పరమాత్మయే! అది యే పరమముగా ఈ జగత్తును అతిక్ర మించియున్నది ఆయనేనని తెలుసుకు న్నవారు సచ్చిదానంద స్వరూపులు. సర్వాంతర్యామిత్వము కలిగిఉన్న పర మాత్మ సగుణుడుగాను, నిర్గుణుడుగాను వ్యక్తమవుతున్నాడు. అందువలననే భక్తుని కోరికమేరకు ఏ రూపంలోనైనా సాక్షాత్కరిస్తు న్నాడు. అదే పరమాత్మ అవతార రహస్యం. అన్ని జీవుల హృదయాలలోను వసిస్తూ వాటి లో పరిణతిని తీసుకువస్తూ చివరికి ముక్తిని ప్రసాది స్తున్నాడు. అంగుష్ట మాత్రమైన ఆత్మ అని నిర్వచిం చడంలోని అర్థం సాధకుడు సూక్ష్మ భావనతో సాధ నచేసే అవకాశం కల్పించడం పరమాత్మ స్వరూపం.
సహస్ర శీర్షా పురుష సహస్రాక్షు సహస్ర పాత్‌
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్‌||
అనంతుడు వేయి కన్నులు, వేయి తలలు, వేయి పాదాలు, వేయి హస్తాలతో ఈ విశ్వాంతరాళమంతా వ్యాపించి ఉన్నాడని తెలియచేస్తోంది. ఇది ఎంత అద్భుతమైన, జ్ఞానవంతమైన భావనో! ప్రస్తుత విజ్ఞా నశాస్త్ర పరిధిని మించి ఈ విశ్వం ఉన్నదని గ్రహిం చాలి. ఇప్పటికీ విశ్వం ఆది, అంతము రహస్యమని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
నవద్వారే పురే దేహి హంసో లేలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్యచ
నవద్వారాలతో నిర్మితమైన ఈ శరీరము నివసిం చేది, దీనితో ఈ బాహ్య ప్రపంచంలో క్రీడించేది ఆ ఆత్మరూపుడైన పరమాత్మ.
ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవడమే ముక్తి, మో క్షం. ఈ చింతనాశక్తి ఒక్క మానవునికే ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఈమాత్రం దాని కి భౌతిక సంపదతో అరిషడ్వర్గాలలోపడి కొట్టుకుం టూ ఈ జనన మరణ చక్రభ్రమణంలో నరకయా తన అనుభవిస్తున్నాడు. ఈ అజ్ఞానం నుండి బయట పడటానికి మార్గం చూపేది ఒక్క సనాతన ధర్మ మన్న సంగతి తెలుసుకోవడమే జ్ఞానానికి ప్రథమ సోపానం. సత్కర్మలు చేయడం మనవంతు. ఫలితాల సంగతి పరమాత్మ వంతు.

– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement