Saturday, May 4, 2024

ఆలోచనా సాగర మధనం ఎలా చేయాలి?

ఆలోచనలను మధించడం ఎలా? మన ఆలోచనలో రూపురేఖలు, విధివిధానం ఎలా ఉండాలి? అనేది ఒక ప్రశ్న ఆలోచనా సాగర మధనం యొక్క పద్ధతి మేము దాని వలన కలిగే లాభాల గురించి, చెప్పిన వాటిని గురించి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఉదా:- ఆలోచనా సాగరమధనం చేయుట వలన సంతోషం పొంగిపోతుంది అనే లాభం గురించి చెప్పాము. ఇపుడు మీకందరికీ సంతోషం ముఖ్యంగా రెండు కారణాలు వలన పెంపొందుతుందని తెలుసు. ఏదైన సమస్య పరిష్కారమైనపుడు లేదా ఏదైనా ప్రాప్తి లభించినపుడు. కావున మనం ఈశ్వరీయ జ్ఞానం యొక్క ఏదో ఒక మహావాక్యం లేక ఒక రహస్యం తీసికొని ఆ జ్ఞాన బిందువులతో సమస్యలు ఎలా పరిష్కరించబడుతున్నవో దానివలన మన జీవితంలో ఏయే ప్రాప్తులు కలుగుతున్నాయో చింతన చేయాలి. సమస్యలు కూడా ముఖ్యంగా మూడు రకాలుగా వుంటాయి. ఒకటి మన వ్యవహారంతో సంబంధించినవి, రెండవది మన పురుషార్థానికి సంబంధించినవి. మూడవ ది మన సమాజము, దేశము, లోకానికి సంబంధించినవి. ఈ విధంగా ఏదో ఒక జ్ఞాన బిందువును తీసికొని మనం ఈ మూడు రకాల సమస్యలతో సంబంధించి చూచుకొనాలి. ఈ విషయం మేమొక ఉదాహరణతో స్పష్టం చేస్తాము.
శివబాబా జ్ఞాన మురళీలో ప్రతిరోజు వచ్చే ఒక ముఖ్య మహావాక్యం పిల్లలూ! ఆత్మాభిమానిగా కండి! అంటారు.

….బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement