Tuesday, April 30, 2024

బ్రహ్మాకుమారీస్‌ — ఆత్మజ్ఞానం (ఆడియోతో…)

ఈ భౌతిక ప్రపంచంలో జీవితాన్ని గడపటానికి విద్య అవసరము. అయితే జీవితాన్ని విజయవంతం చేసికొనడానికి, ప్రతి క్షణాన్ని నిత్య నూతనంగా అనుభవించటానికి, ప్రతి నిమిషాన్ని ప్రశాంతంగా గడపటానికి ఆత్మజ్ఞానం ముఖ్యం.

”నిన్ను నీవు తెలుసుకో” అన్న ప్రబోధంతో ఉత్తేజితులై ఎందరో ప్రయాణం చేశారు. ఈ భౌతిక ప్రపంచంలో తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొనటంలో ఈ అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ జీవితములో ఆధారాన్ని గుర్తిచాలని ఎందరో ఎన్నో ప్రదేశాలు గాలించారు. ఎన్నో దూరాభారాలు సహించారు.

ఇంత జరుగుతున్నా ఈ నాటి ప్రపంచ ప్రజలు అనాధులుగానే ఉండిపోతున్నారు. వారు వారి తండ్రిని మరచిపోయారు. తమను తామే విస్మరించారు. ఆత్మజ్ఞానం ఒక్కటే ఈ సత్యాన్వేషణకు చేర్చే మార్గము. నిరంతర సత్యప ధం. ఆధ్యాత్మిక చైతన్య భూమికలను అధివహించటానికి పరమాత్ముని అనుభూతికి తెచ్చుకొనుటకు అది ఒక్కటే శరణ్యం. భగవంతుడు ఉన్నతులలో కెల్లా సర్వోన్నతుడు. ఆయన స్ఫురణ సర్వోన్నత విద్య. భగవంతుడు జ్ఞానసాగరుడు. ఆయనను తెలుసుకొన్నవాడు అన్నీ తెలుసుకొన్నట్లే. ఆత్మానుభూతికి ఉన్నతోన్నతమైన పౌరలౌకిక తండ్రి అయిన పరమాత్మను అనుభూతి చేసుకోవాలి. ఇదే అత్యున్నతమైన విద్య.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement