Tuesday, July 16, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనలోని చైతన్యమును అన్ని సమయాల్లో సరైన పనితీరుతో పూర్తి నమ్మదగినదిగా చేయడానికి, మన చైతన్యతలో ఉన్న అతి ముఖ్యమైన సామర్థ్యం విచక్షణ దీని ద్వారా సత్యము – అసత్యము, నిజము – అబద్దము, ప్రాధాన్యత – అప్రాధాన్యత, చెప్పేదేమిటి – ఉన్నదేమిటి? అనే భేదమును గమనించగలుగుతాము. ఈ సామర్థ్యం బలహీనమైనప్పుడు ఏది సత్యమో మనకు చెప్పడానికి మనం బయటి సలహాదారులపై ఆధారపడతాం. మనం మనలోని సత్యతకు విరుద్ధంగా వెళ్లిన ప్రతిసారీ మన చైతన్యతలో కార్యాచరణ సడలుతుంది. ఈరోజు నా చైతన్యతను సరైన పనితీరులో ఉండడానికి నిజాయితీని మనసా, వాచా, అభ్యాసం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement