Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 28
28
అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ
తత్ర కా పరిదేవనా ||

తాత్పర్యము : సృజింపబడిన జీవులందరును ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడకయుందురు. అట్టి యెడ దు:ఖించుటకు అవసరమేమి కలదు?

భాష్యము : కొందరు నాస్తికులు అసలు ఆత్మ అనేదే లేదని భావించుదురు. వారి ప్రకారము మనము చూస్తున్న సమస్తమూ, భౌతిక మూలకాల పరిణామము చేతనే ఏర్పడును. మొదట అప్రకటముగా ఉండి కాలక్రమేణ మార్పు చెంది వస్తువులు, వ్యక్తులుగా ఏర్పడి మరికొంత కాలమునకు తిరిగి శిథిలమగును. మట్టి నుండి రాళ్ళు, రాళ్ళ నుండి భవనము మరికొంత కాలమునకు ఆ భవనము తిరిగి మట్టిలో కలిసిపోవును. కాబట్టి తరచు జరిగే పుట్టుక గిట్టుకలకు కలత చెందవలసిన అవసరము లేదు. వేదాలలో అందునా ప్రత్యేకించి భగవద్గీత నందు భౌతిక శరీరము అశాశ్వతమని, ఆత్మకు దుస్తులవంటిదని వివరంచబడినది. మరొక రకముగా చెప్పవలెనంటే ఈ భౌతిక శరీరము వాస్తవము కాదనే అవగాహన ఆధారముగా వేదాలు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి మనము ఆత్మఉనికిని గుర్తించినా గుర్తించకపోయినా శరీరాన్ని కోల్పోవుచున్నామని దు:ఖించవలసిన అవసరము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement