Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 11
11
అయనేషు చ సర్వేషు
యథాభాగమవస్థితా: |
భీష్‌మమేవాభిరక్షంతు
భవంత: సర్వ ఏవ హి ||

తాత్పర్యము : సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్‌మ దేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.

భాష్యము : దుర్యోధనుడు భీష్‌ముడి పరాక్రమమును కొనియాడిన తర్వాత మిగిలిన వారు చిన్నబుచ్చుకోకుండా ఉండేందుకు వారందరూ ఎంత ముఖ్యమో తెలియజేయుచుండెను. వారు వారు తమ స్థానాలనందుండి భీష్‌ముడిని అన్నివైపుల నుండి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేసెను. దీని ద్వారా దుర్యోధనుడు తన విజయం భీష్‌ముడి మీదే ఆధారపడి ఉందని స్పష్టపరచుచున్నాడు. భీష్‌మునికి, ద్రోణాచార్యునికి పాండవులంటే ప్రత్యేక అభిమానమున్నా, ద్రౌపది వస్త్రాపహరణ సమయములో మౌన ము వహించుట వలన తన పక్షాన ఈ రోజున కూడా పోరాడగలరనే విశ్వాసము దుర్యోధనునికి ఉన్నది. అదే తన విజయానికి సోపానమని భావించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement