Friday, March 29, 2024

Big Story: కాంగ్రస్​లో సర్వే సంబురం.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రేవంతే సీఎం?

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉంది. అయినా అప్పుడే రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​ పెరిగిపోతోంది. అధికార టీఆర్​ఎస్​ పార్టీతోపాటు విపక్షాలు పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటన్న దానిపై సర్వేలు చేయించుకుంటున్నాయి. వాటి ఫలితాల ఆధారంగా పార్టీ లైన్​, వ్యూహాలను మార్చుకుంటూ జనాధరణ పొందేలా ప్లాన్​ చేసుకుంటున్నాయి. అయితే.. ఈ మధ్య కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం సంచలన విషయాలే వెలుగుచూశాయంటున్నారు ఆ పార్టీ లీడర్లు. ఈ సర్వే ఆ పార్టీ లీడర్లు, కేడర్​లో జోష్​ నింపేలా ఉందని సమాచారం. ఇంతకీ ఆ సర్వే ఏం చెబుతుందంటే..

తాజాగా ఓ ప్రైవేట్​ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తుందట. సర్వే ప్రకారం.. అదనంగా 12 సీట్లను గెలిస్తే సరిపోతుందని వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్​కు 48 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందట.. కాగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ మంచి ఊపుమీద ఉన్నట్టు రిపోర్టు చెబుతోంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో కాంగ్రెస్​కు జనంలో పట్టున్న నాయకులున్నారని, మెదక్​లో కూడా పార్టీ బలంగానే ఉందని కాంగ్రెస్​ లీడర్లు అంటున్నారు. అంతేకాకుండా రెండుసార్లు కేసీఆర్​ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్​ ఓ చాన్స్​ ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సర్వే రిపోర్టు వెల్లడించినట్టు సమాచారం.

అయితే.. ఉత్తర తెలంగాణలో టీఆర్​ఎస్​, బీజేపీ బలంగా ఉన్నా.. కాంగ్రెస్​ పార్టీ ఈ రెండింటినీ ఢికొట్టే సత్తా ఉన్నట్టు ఆ పార్టీ లీడర్లు అంచనా వేసుకుంటున్నారు. పార్టీ యంత్రాంగం కాస్త గట్టిగా కృషి చేస్తే మరింత బలపడే చాన్స్​ ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకి అయినా 60 సీట్లు కావాలి. కాగా, కాంగ్రెస్​ గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్న 48 స్థానాలకు తోడు మరో 12 సీట్లు కైవసం చేసుకుంటే అధికారం చేజిక్కించుకోవడం ఖాయం అంటోంది సర్వే రిపోర్టు.

కేసీఆర్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ఎన్నికల నాటికి ఇది కాంగ్రెస్​కు అనుకూలంగా మారుతుందన్న అంచానల్లో ఆ పార్టీ నేతలున్నారు. అందుకని ఈజీగా మ్యాజిక్​ ఫిగర్​కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ సర్వే ప్రకారం 48 సీట్లే వచ్చినా తమకే చాన్స్​ ఉంటుందని కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ఎంఐఎం పార్టీకి వచ్చే దాదాపు 9 సీట్లు, బీఎస్పీ సహా ఇతరులు చీల్చుకునే సీట్లతో వారి మద్దతు సంపాదించి గద్దెనెక్కడం ఖాయం అంటూ ఇప్పుడే సంబురాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్​ లీడర్లు. అట్లయితే రానున్న ఎన్నికల్లో రేవంత్​ రెడ్డి సీఎం కావడం ఖాయమే అంటూ.. విజయావకాశాలను అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement