Thursday, May 9, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 38
38
ధూమేనావ్రియతే వహ్ని:
యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భ:
తథా తేనేదమావృతమ్‌ ||

అర్థము : పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడి యుండును.

భాష్యము : జీవుడు కామము యొక్క తీవ్రతను బ ట్టి మూడు విధాలుగా అతని శుద్ధ చైతన్యము కప్పబడును. పొగ చేత అగ్ని కప్పబడినట్లన్న, పొగ ఉన్న చోట అగ్ని ఉన్నదన మనకు అర్థము అయినా అది బయటకు కనిపించదు. దానికి మించి ధూళి చేత అద్ధము కప్పబడినట్లన్న మన ప్రతిబింబము అద్దములో చూచుటకు అనేక పద్ధతుల ద్వారా మనస్సును పవిత్రీకరించవలసి ఉంటుంది. దీనికి ఉత్తమమైనది భగవన్నామ సంకీర్తన. ఇక దీనికి మించి మావి చేత గర్భము కప్పబడినట్లన్న శిశువు కదులుటకు కూడా ఆస్కారము ఉండదు. ఈ స్థితిలో చైతన ్యము పూర్తిగా కప్పివేయబడి ఉంటుంది. ఈ మూడు విధాలను వరుసగా మానవులలోనూ, పశు పక్షాదులలోనూ మరియు చెట్టు చేమలలోనూ గమనించవచ్చును. కాబట్టి మానవులకు సరైన మార్గదర్శనము ద్వారా కృష్ణ చైతన్యాన్ని పెంపొందిచుకున్న ఈ కామాన్ని జయించే అవకాశము కలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement