Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 40
40
ఇంద్రియాణి మనో బుద్ధి:
అస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష
జ్ఞానమావృత్య దేహినమ్‌ ||

అర్థము : ఇంద్రియములు, మనస్సు, బుద్ది అనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును.

భాష్యము : కామాన్ని జయించాలనుకునే వారికి శ్రీకృష్ణుడు ఇక్కడ శత్రువైన కామము యొక్క నివాస స్థానాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇంద్రియ భోగ కోరికలన్నింటికి మూలము మనస్సు. ఆ మనస్సు ఇంద్రియాల ద్వారా ఆ కార్యాలను చేయుటకు పురి గొల్పుతుంది. బుద్ధి వాటికి తగిన ప్రణాళికలను రూపొందిస్తుంది. అటువంటి బుద్ధి ఆత్మను, మనస్సు, ఇంద్రియాల ఆనందమే తన ఆనందమని భ్రమకు లోను చేసి మిధ్యాహంకారాన్ని కలుగచేస్తుంది. దానితో ఆత్మ ఇంద్రియ తృప్తికి బానిస అయి, అదే నిజమైన ఆనందమని భావించుటతో ఓటమి పాలవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement