Thursday, April 25, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

ప|| కదిరి నృసింహుడు కంభమున వెడలె
విదితముగా సేవింపరో మునులు ||కదిరి నృసింహుడు||

చ|| ఫాలలోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలచె ||కదిరి నృసింహుడు||

చ|| ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెటి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
అడియాలపు రూపై వెలసె ||కదిరి నృసింహుడు||

చ|| సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలి యగుచు శ్రీ వేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించె నిదివో ||కదిరి నృసింహుడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement