Thursday, May 23, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇదివో సద్దులు

రాగం : మోహన

ప|| ఇదివో సుద్దులు ఈరేపల్లెను
కదిపి ఇందరివి గైకొనవయ్య || ఇదివో ||

చ|| పలుచని రెప్పల పగటులు నెరుపుచు
సొలసి నిన్నొకతె చూచెనట
తళుకుల గోళ్ళుదండె మీటి యిదె
పలికి నిన్నొకతె పాడెనట || ఇదివో ||

చ|| చనవులు నెరపుచు సన్నసేయుచును
ననుపున నొక్కతె నవ్వెనట
చెనకి యొక్కతె అదె చిగురు గేదగుల
వెనక నుండి నిను వేసెనట || ఇదివో ||

చ|| అదన నీవు నన్ను అలమి పట్టంగా
కొదలి యొక్కతె కని గొణిగెనట
ఎదురనె శ్రీ వేంకటేశ యొకతె నీ
చెదరిన అలుకలు చెరిగెనట || ఇదివో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement