Thursday, April 25, 2024

పీఆర్సీతో సహా ఉద్యోగుల‌ కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం : జ‌గ‌న్

పీఆర్సీతో సహా ఉద్యోగుల‌ కోసం అనేక పథకాలు తీసుకొచ్చామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల‌కు మంచి జ‌ర‌గాల‌నే ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 62ఏళ్ల‌కు పెంచామ‌న్నారు. కోవిడ్ కారణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించిన కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. కారుణ్య నియామకాలను జూన్ 30వ తేదీ లోగా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో జాప్యం జరుగుతుందని భావిస్తే వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ జూన్ 30వ తేదీ నాటికి ప్రొహిబిషన్ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. జులై 1వ తేదీకి వారికి కొత్త జీతాలు అందాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ఉద్యోగులకు పదిశాతం రాయితీ ఇస్తామని చెప్పామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement