Tuesday, October 8, 2024

అన్నమయ్య కీర్తనలు : ఆదిపురుషా

ఆది పురుషా అఖిలాంత రంగ
భూదేవ తా రమణ భోగీంద్రశయన || ఆదిపురుషా ||

భవపాథోనిధి బాడ బానల
భవ జీమూత ప్రభంజనా
భవ పర్వత ప్రళయ భయదనిర్ఘాంతదు –
ర్భవ కాల కూట భవ బహు విశ్వరూప || ఆదిపురుషా ||

భవఘోర తిమిర దుర్భవకాలమార్తాండ
భవ భద్ర మాతంగ పంచాననా
భవ కమలభవ మాధవ రూప శేషాద్రి
భవన వేంకటనాధ భవరోగవైద్య || ఆదిపురుషా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement