Thursday, May 2, 2024

అన్నమయ్య కీర్తనలు : రావే కోడల

రాగం : యాదకుల కాంభోజి

రావే కోడల రట్టడి కోడలా
పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో చాలును || ||రావే కోడల||

రంకెలు వేయుచు రాజలెదుట నీవు
పొంకు కొసరులేని కోడలా
పంకజ ముఖినీవు పల్లుదొడ్ల వారింట్ల
అంకెల తిరిగేవు అత్తయ్యా || ||రావే కోడల||

యీడాడ నలుగురినీ గురుమగలతో
కూడి సిగ్గులేని కోడలా
వాడకు పదుగురి వలపించుకొని నీవు
ఆడడ తిరిగేవు అత్తయ్యా || ||రావే కోడల||

- Advertisement -

బొడ్డున బుట్టి బూపనికే నిను
గోడ్డేరు తెస్తినే కోడలా
గుడ్డము పై నున్న కోనేరాయుని
అడ్డగించు కొంటి వత్తయ్యా || ||రావే కోడల||

Advertisement

తాజా వార్తలు

Advertisement