Tuesday, May 7, 2024

సకల సౌభాగ్యకరం అంబాత్రయ ఆరాధనం!

కొల్లూరు మూకాంబిక, శ్రీకాళహస్తి జ్ఞానాంబ, శ్రీశైల భ్రమ రాంబ ఈ ముగ్గురమ్మలు అంబాత్రయంగా ప్రసిద్ధి.

కొల్లూరు మూకాంబిక

అంబాత్రయంలో ఒకరు కొల్లూరు మూకాంబిక. కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యు లు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. శంక రాచార్యుల కోరిక మన్నించిన అమ్మవారు. షరతు విధించింది. నీ వెంట వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని చెప్పింది అమ్మ వారు. ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మ ఆయన్ని అనుసరించింది. అలావెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపో వడంతో ఆదిశంకరాచార్యులు ఠక్కున వెనక్కు తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనను అక్కడే ప్రతిష్టించమని చెప్పి శిలగా మారిపోయింది. శ్రీచక్రంతో పాటుగా మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించారని చెబుతారు. గర్భాలయంలో ‘శంకర సింహాసనం’ ఉంది. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ ఈ అమ్మవారికి ఆదిశంకరాచార్యులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి.
మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని ప్రతీతి. దీనికి సంబంధించిన కథ. మూకాంబిక ఆల యంలో తేనెని ఉపయోగించి తయారుచేసే ‘పంచ కడ్జాయం’ అనే ప్రసాదం ప్రత్యేకం. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని కేరళ నివాసి ఒకడు ఆ ప్రసాదం తినాలన్న కోరి కతో బావిలో దాక్కుని ఆ ప్రసాదం తిన్నాడట. ఆ తర్వాత అతడు మహా పండితుడు అయ్యాడని చెబుతారు. పండితులు అవడమే కాదు, ఈ అమ్మని దర్శించుకుంటే ఎలాంటి వ్యసనాలు అయినా దూరం అయిపోతాయని చెబుతారు. ఆ తల్లికి నివేదించిన ప్రసాదం స్వీకరిస్తే అనారోగ్యం తొలగిపోతుందని విశ్వాసం.
ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవ#హస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. పక్షిరాజు గరుడుడు ఈ నది ఒడ్డున తన తల్లిని నిరంతర కష్టాలు మరియు దు:ఖాల నుండి రక్షిం చడానికి తపస్సు చేశాడని నది వెనుక ఉన్న పురాణం చెబుతుంది. అతను తపస్సులో కూర్చున్నాడని చెప్పబడిన ప్రదేశంలో, నేటికీ ‘గరుడ గుహ’ అని పిలువబడే ఒక చిన్న గుహ ఉంది. అప్పుడు కొల్లూరు దేవి లేదా పార్వతి దేవి అతని ముందు ప్రత్యక్షమైంది. మరి యు ఈ సమయంలో ఈ గరుడుడు దేవిని ఈ నదికి తన పేరు పెట్ట మని అభ్యర్థించాడు కాబట్టి ఈ నదికి సౌపర్ణికా నది అని పేరు వచ్చింది.

శ్రీకాళ#హస్తి జ్ఞానప్రసూనాంబ

దక్షయజ్ఞ సమయమున ద్రాక్షాయణిదేవి యాగాగ్ని యందు దగ్ధమైన పిదప మరల హమవంతుని పుత్రికగ గౌరీదేవిగా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను. అందులకు గాను పరమేశ్వరు డు నీ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహ మాడుటకు వీలుపడదని చెప్పెను. అందులకు పరమేశ్వరి తక్షణ క ర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పర మేశ్వరికి (పంచాక్షరి) మంత్రము ఉపదేశించెను. తదుపరి పార్వతి ఈ క్షేత్రమునందు తన స్వహస్తములతో శ్రీచక్ర స్థాపన కావించు కొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వ రుని కళ్యాణము చేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనము న నిలచి తాను సాధించిన జ్ఞానశక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది. కా వున ఈ క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబికగ వ్యవ#హరించి పూజాలందుకొనబడు చున్నది. తనచే మంత్రోపదేశం పొంది నటువంటి భరద్వాజ మహర్షి మొద లు ఇప్పటివరకు భరద్వాజ వంశీకు లే ఈ క్షేత్రము నందు షట్కాల పూజ లు నిర్వహంచడం జరుగుచున్నది.
గర్భాలయంలోని జ్ఞానప్ర సూనాంబ అమ్మవారు కొద్దిగా ఓ ప్రక్కకు ఒరిగి వుంటారు. పరమేశ్వ రుడు ఏదో చెబుతుంటే వింటున్న ట్లుగా వుంటారు. అమ్మవారికి వడ్డా ణంగా వున్న నాగాభరణాన్ని మన కళ్ళతో చూడవలసిందే ఆ అనుభూతిని వర్ణించలేము. ఆ ప్రదేశంలో పూర్వం అష్టదళ బిల్వ వృక్షాలు వుండేవట. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ క్షేత్రంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించి న దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు.
శ్రీకాళహస్తిలో కొలువైఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు భక్తులను అనుగ్రహంచడానికి తల ఓ వైపువా ల్చి ఉందని, ఇలా ఏ క్షేత్రం లో కూడా లేదని చెబుతారు.
గంగాదేవి సువర్ణ ముఖీ స్ర వంతి రూపమున అగస్త్య పర్వత ములో అవతరించి శ్రీకాళహస్తి మీదుగా ఉత్తర వాహనియై తూ ర్పు సముద్రమున కలియుచున్న ది. ఈనాడు నదిలో అనేక తీర్ధ రాజ ములు విలసితములై దక్షిణ కైలాసమును ఆనుకొని ప్రవహంచుచు న్నది. సువర్ణముఖి ఈ క్షేత్రమున ఉత్తరవాహనిగా ప్రవహంచు చున్నది. ఇది గంగానదికి సమానమై నదిగా పురాణ ప్రసిద్ధినొంది యున్నది.

- Advertisement -

శ్రీశైల భ్రమరాంబ

సతీదేవి ఖండితాంగాలలో మెడ భాగము ఈ పవిత్ర శ్రీశైల క్షేత్రంలో పడినది. అష్టాదశశక్తి పీఠములలో 6వ శక్తిపీఠము ఈ భ్రమరాంబ శక్తిపీఠము. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ప్రాచుర్య ములోని కథనము ప్రకారము అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడు అయినాడని, రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సం#హరించేందుకు. ఇక్కడ కొలువైన సతి ‘శక్తి’ భ్రమర (తుమ్మెద) రూపంలో అవతరించి వేలకొలది ఆరుకాళ్ళ తేనెటీగలను సృష్టించ గా వాటివలన అరుణాసురుడు సం#హరించబడినాడు. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుకభాగంలో కొలువై ఉందని స్థలపురాణం. అప్పటి నుండి దుర్గ భ్రమరాంబికా రూపముతో శ్రీశైలమునందు వెలసినది శంకరా చార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్రం ప్రతిష్టించి, భ్రమరాంబాష్టకం రచించారు అని, శ్రీశైల క్షేత్రంలోనే ఆయన ‘సౌందర్యలహరి’ కూడా రచించారని చెబుతారు.
శ్రీశైలంలో ప్రవహంచే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహ స్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడా నికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహంచింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ’ అని పిలుస్తారు.
తూర్పు కనుమలు అయిన నల్లమల కొండలకు ఆభరణముగా నున్నది భ్రమరాంబికా ఆలయం. ఈ తూర్పు కనుమలకొండలలో శ్రీగిరి, శ్రీమల, శ్రీనగర, నంది తపస్సుచేసి శివపార్వతుల దర్శనము పొందిన ఋషభగిరి ఉన్నవి. అందువలననే ఈ కొండకు ఋషభగి రి అని పేరు. పూర్వము గుప్తుల వంశమునకు చెందిన మహారాణి చంద్రావతి గృహ కలహము నెదుర్కొని రాజ సుఖములను విడచిపె ట్టవలెనని నిర్ణయించుకొనినది. ఆమె శ్రీశైలం అడవులకు వెళ్ళి అచ ట పండ్లు, ఆవు పాలు ఆహారముగా జీవించసాగినది. ఒకరోజు ఆమె ఆవులలో ఒకటి పాలు ఇచ్చుటలేదని గమనించినది. పశువుల కాప రి ద్వారా ఆ ఆవు ఒక నిర్ణీత ప్రదేశమునకు వెళ్ళి అచట పాలు మల్లెతీ గలచే కప్పబడిన ఒక శివలింగముపై చల్లుచున్నట్లు తెలుసుకొని నది. మరుసటి రోజు తాను కూడా ఆ స్థలమునకు వెళ్ళి ఆ వింత చూసినది. ఆ రాత్రి శివుడు ఆమె కల లోనికి వచ్చి తనను చూసిన స్థల ములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించినాడు. ఆ లింగము మల్లెతీగలందు చిక్కుకొని దర్శనమిచ్చుట వలన స్వామికి మల్లిఖా ర్జునుడు అని పేరు వచ్చినది.
ఇలా ఆయా పవిత్ర క్షేత్రాలలో కొలువుదీరి ఆయురారోగ్య ఐశ్వ ర్య సకలసౌభాగ్య ప్రదాతలైన మూకాంబ, జ్ఞానాంబ, భ్రమరాంబ లు అంబాత్రయంగా మనలని అనుగ్ర#హస్తున్నారు. శ్రీ మాత్రేనమ:!

Advertisement

తాజా వార్తలు

Advertisement