Saturday, May 4, 2024

సకల సౌభాగ్యదాయకం…షట్తిల ఏకాదశి వ్రతం!

విష్ణు భక్తులు ప్రతినెల ఏకాదశి తిథి శ్రీమహావిష్ణు ప్రీత్యర్థం విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటారు. సంవత్సరానికి వచ్చే పన్నెండు తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి తిథి ఒక నిర్దిష్ట పురాణగాథతో ముడిపడి ఉంటుంది. పుష్యమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. తిల అంటే నువ్వులు షట్తిల ఏకాదశి రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వ#హంచడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు.
ఆ రోజు శ్రీమన్నారామణునికి, పితృదేవతలకు అత్యంత ప్రీతికమైనది. ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు నువ్వులు నీటిలో వేసుకోవచ్చు. ఈరోజు ఆచరించా ల్సిన ఆరు ధర్మ విధుల గురించి కూడా మన పురాణాలు పేర్కొన్నాయి.
షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు ఇవే.
1) తిలాస్నానం: నువ్వుల నూనె వంటికి రాసుకుని, నల్ల నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి.
2) తిల లేపనం: స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం.
3) తిల హోమం: ఇంటిలో తిల హోమం నిర్వ #హంచాలి.
4) తిలోదకాలు: పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట. నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం.
5) తిలదానం: నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రా#హ్మణునికి దానం ఇవ్వాలి.
6) తిలాన్న భోజనం: నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వు లు వేస్తే అది తిలాన్నం అవుతుంది. అలాగే వంటకాలలో నువ్వులు వేసి వంట చేసుకోవచ్చు.
ఈ రోజున తిలలతో నిర్వ#హంచే ఈ ఆరు పనులు పూర్తిచేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈనాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తి ప రుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకా దశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమ న్నారాయణుడు సంతసించి ఇ#హలో కంలో సర్వసుఖాలు, మరణా నంతరం ఉత్కృష్ట లోకా లు ప్రాప్తింపచేస్తాడు.
ప్రకృతికి అను గుణంగా మన పూర్వీకులు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా నువ్వుల వాడకాన్ని విధిగా చేశారు. నువ్వుల పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
తిలలు (నువ్వులు) శరీరానికి బాగా వేడిని కలిగించే పదార్థం. నువ్వులతో అనేక రకాలైన పిండివంటలు చేస్తారు. ఆహార పదార్థాల్లోనూ వీటి వినియోగం విరివిగా కనిపిస్తుంది. నువ్వులనూనెతో దైవానికి దీపాలను వెలిగించడం ద్వారా గృ#హంలో రోగనిరోధక శక్తి పెరు గుతుంది. నువ్వుల నూనెను శరీరానికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే దే#హ దారుఢ్యం కలుగుతుంది. శరీరానికి కావల్సిన వేడి అందుతుంది. చలికాలంలో ఇది మరింత విశేషం. స్నాన సమయంలో నీళ్లలో నువ్వులు వేసుకునే సంప్రదాయమూ ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి పాటించినవారికి విష్ణుమూర్తి మోక్షం ప్రసాదిస్తాడని నమ్ముతారు.

షట్తిల ఏకాదశి వ్రత కథ

మన ఇతిహాసాలలో వున్న షట్తిల ఏకాదశి కథ. శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి షట్తిల ఏకాదశి వ్రత కథను స్వయంగా వివరించాడు.
ఒకానొకప్పుడు ఒక ధనవంతురాలు తన సంపదను దానధర్మాలకు ఖర్చుచేయడం మొదలుపెట్టింది. డబ్బు, బట్టలు, విలువైన వస్తువు ఎవరికి ఏది కావాలంటే అది దానం చేసేది. కానీ ఎవరికీ ఆహారం పెట్టేది కాదు. ఆహారం మినహా ప్రజలకు కావలసినవన్నీ ఇచ్చేది. అన్నిరకాల దానాలలోనూ అన్నదానం అత్యంత పు ణ్యప్రదమని కదా! అందుకే శ్రీమహావిష్ణువు ఆమెకు అన్నదాన మహిమను తెలియచేయాలని అనుకున్నా డు. భిక్షకుడి రూపాన్ని ధరించి, ధనిక మహిళ వద్దకు వెళ్లి ఆహారం పెట్టమని వేడుకున్నాడు. ఆ స్త్రీ ఆయనకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడలేదు సరికదా అతన్ని తరిమి కొడు తుంది. భిక్షగాడు ఆహారం పెట్టమని పట్టుబట్టడంతో అతని భిక్షా పాత్రలో ఓ మట్టి ముద్దను వేసి అవమానిస్తుంది. అయినా కూడా భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ధనవం తురాలు ఇంట్లోకి వెళుతుంది. ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా మట్టిగా మారిపోయి వుంటుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుం ది. ఆమె ఎంత సంపద ఉన్నప్పటికీ తినడానికి ఆహారం లేకుండాపోయింది. వండిన పదార్థాలు, కొనుగోలుచేసిన పదార్థాలు అన్నీ మట్టిగా మారిపో యేవి. దాంతో ఆమె ఏవిధమైన ఆహారం తినలేకపోయింది. ఆకలికి తట్టుకోలేకయేది. ఆహా రం తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడం ప్రారంభించింది. తనను రక్షించమని శ్రీమహావిష్ణువును ప్రార్థించింది. భగవంతుడు ఆమె కలలో కనిపించి, మట్టి ముద్దవేసి భిక్షకుడిని అవమానించినందుకు ఫలితంగా ఈ దుస్థితి కలిగిందని, పేదలకు అన్న దానం చేయమని, షట్తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించ మని భగవంతుడు ఆ స్త్రీకి ఆదేశిస్తాడు. శ్రీమహావిష్ణువు చెప్పిన ఆ రెండింటిని ఆచరించడంతో ఆమె కోల్పోయినదంతా తిరిగి పొందగలిగింది. అప్పటి నుంచి ఆమె పేదలకు అన్నదానం చేయడం ప్రారంభించి సద్గతులు పొందుతుంది. షట్తిల ఏకాదశి వ్రతాన్ని పూర్తి విశ్వాసంతో, భక్తితో ఆచరించినవారికి శ్రీమహావిష్ణువు సకల సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు పేదలకు ఆహారం, బట్టలు, విలువైన వస్తువులు, డబ్బు దానం చేయడం అత్యంత పుణ్యప్రదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement