Wednesday, May 8, 2024

శ్రీకృష్ణస్వామి వారికి నూతన యజ్ఞోపవీతం

తిరుమ‌ల‌ : శ్రావణ ఉపకర్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ వరాహ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్వామి పుష్కరిణి
వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం(పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement