Friday, May 3, 2024

శక్తి – భక్తి – ముక్తి – అమృతం చిలకరించే ‘అమ్మ’ చూడ్కులు

జగన్మాత ఎలా జీవులను రక్షిస్తుందో తెలిపే రామాయణ ఉదాహరణను ఒక దానిని చూద్దాం….

‘వధార్హమపి కాకుత్స: కృపయా పరిపాలయత్‌’ అంటారు. అంటే చంపదగినవాడైనప్పటికీ కాకాసురుడిని దయతో కాపాడినాడని భావం. రావణాసురుడు, కాకాసురుడు ఈ ఇద్దరూ సీతమ్మ విషయంలో సమానంగానే అపరాధం చేసినా సీతమ్మ పక్కన ఉన్నందు వల్ల కాకాసురుడు ప్రాణాలతో బయటపడ్డాడు. నిజానికి సీతమ్మతల్లి వక్షాన్ని గాయపరిచి కాకాసురుడే ఇంకా పెద్ద తప్పు చేశాడు. అయినప్పటికీ ఆ తల్లి బిడ్డ తప్పును మన్నించింది. కాపాడింది.

రాముడు దర్భతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కాకాసురుని వెంటబడిందే తప్ప వధించలేదు. కాకాసురుడు ముల్లోకాలూ తిరిగి చివరికి రాముని ఎదుటకే వచ్చి పడ్డాడు. రాముని అస్త్రాన్ని అడ్డుకోగలవారెవరు? ఇంకెవరు….అమ్మయే. బిడ్డ తప్పు చేస్తే తల్లి చంపుకుంటుందా? అయ్యో పిల్లవాడు ఏమవుతాడోనని సీతమ్మ దృష్టి అంతా కాకాసురుని పైనే ఉంది. అంటే బ్రహ్మాస్త్రానికీ కాకాసురునికీ మధ్య అమ్మ చూపూ అడ్డుగా నిలిచింది. అమ్మకు అమృతదృక్‌, అమృతా అని పేర్లున్నాయి. అమ్మవారి చూపులు అమృతం చిలకరిస్తాయని అర్థం. అమ్మవారి స్పర్శ అమృతం చిలకరిస్తుంది. అసలు అమ్మవారే అమృతం.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement