Saturday, April 20, 2024

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. 48 ఏళ్ల వ‌య‌సున్న ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు రాహుల్ ద్ర‌విడ్ సుముఖంగా లేన‌ప్ప‌టికీ, ఆయ‌న‌తో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జ‌య్ షా స‌మావేశ‌మై ఒప్పించారు. దీంతో టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ద్ర‌విడ్ అంగీక‌రించిన‌ట్లు స‌ద‌రు అధికారి తెలిపారు. 2023 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు కోచ్‌గా ఉంటాన‌ని ద్ర‌విడ్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌స్తుత‌మున్న టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం ఈ ఏడాది న‌వంబ‌ర్ 14తో ముగియ‌నుంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత కివీస్ ప‌ర్య‌ట‌న‌తో టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ద్ర‌విడ్ ఉన్నారు. గ‌తంలో ఇండియా-ఏ జ‌ట్టుకు, శ్రీలంక‌లో ప‌ర్య‌టించిన టీమిండియాకు ద్ర‌విడ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement