Monday, May 6, 2024

వ్యావెూహం వినాశ హేతువు

జీవితంలో ఉన్నతిని సాధించాలంటే మనిషి తనలోని అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాలను జయించాలి. ఈ ఆరు రకాలైన శత్రువులే మనిషి ప్రగతికి అవరోధం కలిగిస్తాయి. అవే కామ, క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలు.
మోహం అంటే వ్యామోహం చెందడం. ”తను కోరుకున్న కోరి క కోసం విపరీతంగా తాపత్రయ పడుతూ అధర్మమని తెలిసి నా ఆకోరికను నెరవేర్చుకోవడమే వ్యామోహం” అంటుంది విదుర నీతి. ఒక్క మాటలో చెప్పాలంటే హద్దు మీరిన ప్రేమే వ్యామోహం. వ్యామోహం మానసిక బలహీనత. మనిషి మానసిక బలహీనతగా చెప్పబడే వ్యామోహాలెన్నో విధాలు. కొందరికి ధన వ్యామోహమైతే ఇంకొందరికి పదవీ వ్యామోహం. మరి కొందరికి పరస్త్రీ వ్యామోహ మైతే, పుత్ర వ్యామోహం ఇంకొందరికి ఏ వ్యామోహమైనా చివరకు పతనానికి దారి తీసేదే!
గోస్వామి తులసీదాసు పుత్ర వ్యామోహాన్ని గురించి ఈ పద్యంలో చక్కగా వివరిస్తూ-
సో సుత్‌ ప్రియ పితం ప్రాన్‌ సమానా
జద్యపి సో సబ్‌ భాంతి అపానా
ఏహి విధి జీవ్‌ చరా చర్‌ జేతే
త్రిజగ్‌ దేవ్‌ నర్‌ అసుర్‌ సమేతే
” ఏ తండ్రి అయినా తన కొడుకులను ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు. ఆ కొడుకులు ఎంత మూర్ఖులైనా వారిపై ఉన్న మమ కారం చెదరదు. ఈ పుత్ర వ్యామోహం మనుష్యులే కాదు దేవతలు, రాక్షసులు, పశు పక్ష్యాదుల్లో కూడా కనబడుతుంది” అంటాడు కవి.
ప్రతి ప్రాణికి తన సంతానంపై ప్రేమ ఉండడం సహజమే కానీ ఆ ప్రేమ మితిమీరి వ్యామోహంగా మారకూడదనేదే పద్యంలో అంతరార్థం. పుత్ర వ్యామోహానికి అద్దంపట్టే పాత్ర మహాభారతం లోని ధృతరాష్ట్రునిది. పేరుకే ధృతరాష్ట్రుడు మహారాజు. అయినా ఆయ న కౌరవ సభలో ఒక ఉత్సవ విగ్రహం. తోలు బొమ్మ. దుష్ట చతుష్ట మయిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు ఎలా చెబితే అలా ఇష్టం లేకున్నా పాపపు పనులు చేస్తూ పోయాడు. దుర్యోధ నుని మాటకు ఎదురు చెప్పలేకపోవడం ఆయన చేతలను అడ్డగిం చక పోవడం పుత్ర వ్యామోహమే కారణం.
అంతేగాక ధృతరాష్ట్రుడు నామమాత్రానికే రాజు కానీ రాజ్యం పై సంపూర్ణ అధికారం, పెత్తనం అంతా సుయోధనుడే చెలాయించే వాడు. కౌరవులు పెట్టే అన్ని కష్టాల నుండి పాండవులను కాపాnడు తున్నవాడు కృష్ణ పరమాత్ముడని తెలిసి కూడా తన కొడుకును ఎన్నడూ మందలించలేదు. పుత్రునిపై గల మమకారంతో ఘోర మై న యుద్దానికి, మారణకాండకు సమ్మతించాడు. కానీ కొడుక్కు ఎదురు చెప్పలేకపోయాడు. కొడుకుపై ఉన్న అతి ప్రేమ కారణం గానే వ్యక్తిత్వం లేని రాజుగా అంధత్వంతో నిస్సహాయుడై మాటల్లో, చేతల్లో గుడ్డితనం చూపించాడు. కౌరవుల వినాశనానికి ధృతరాష్ట్రు బని పుత్ర వ్యామో హమే ప్రబల కారణం కదా! పరస్త్రీ వ్యామోహం ఎంతటి అనర్థదాయకమో శ్రీ మద్రామయణం చూపింది.
లంకేశ్వరుడైన రావణ బ్రహ్మ మహా పండితుడు, వ్యాకరణ కోవిదుడు. రాజనీతిజ్ఞుడు. ధర్మ సూక్ష్మాలను ఎరిగినవాడు. అర్ధ శాస్త్ర గణితాల్లోనూ, ఆయుర్వేదంలోనూ, శిల్పగాంధర్వ శాస్త్రాల్లో నూ గొప్ప ప్రావీణ్యం కలవాడు. సకల లోకాలన్నింటిని నోటి మాట ద్వారా శాసించినవాడు. పరమేశ్వరుని వెండికొండ నెత్తిన బలవం తుడు, భక్తిపరుడు. ఒకే ఒక మానసిక బలహీనత, పరస్త్రీ వ్యామో హం సర్వం కోల్పోయేలా చేసి తనను అంతం చేయడమే గాక తన దాయాదులను అంతం చేసింది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ”మితమే హితం” అని చెప్పాడు. వ్యామోహం వీడితే బ్రహ్మమే అంటారు ఆది శంక రులు. ప్రస్తుత సమాజంలో వ్యామోహాల గురించి తెలిసినా పట్టిం చుకోవడం లేదు ఎవరూ!
తాను అమితంగా ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను అంగీకరించడం లేదనే స్త్రీ వ్యామోహపరుడు వ్యవహరించే తీరుతో అష్టకష్టాల పాలవుతున్నాడు. పిల్లలలు కోరుకున్న వాటిని పుత్ర వ్యామోహంతో కొనిపెట్టి అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ధన, వ్యామోహ పరులు అడ్డ దారులు తొక్కి అవమానాల పాలవుతున్నారు.
మిత ఆహారం ఆరోగ్యానికి మంచిది అనే సూత్రాన్ని మరిచిన ఆహార వ్యామోహపరులు అతిగా తిని రోగాలకు గురవుతున్నారు.
అందుకే వ్యామోహం వినాశ హేతువు అని తెలుసుకుని అన్నిం టిలో మితాన్ని పాటించి శారీరకంగా, మానసికంగా అందరు సుఖ సంతోషాలు పొందాలంటాయి మన పురా ణేతి హాసాలు. ”అతి సర్వత్ర వర్జయేత్‌” అం టారు అను భవజ్ఞులు.
– పరికి పండ్ల సారంగపాణి
98496 30290

Advertisement

తాజా వార్తలు

Advertisement