Wednesday, April 24, 2024

సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహం తొలగింపు.. స్థానికుల ఆగ్రహం

అమరావతి: తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భరతమాత విగ్రహం తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విగ్రహం తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉన్న భరతమాత విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఇంటికి భద్రత, రోడ్డు విస్తరణ పేరుతో ఈ విగ్రహాన్ని సోమవారం రాత్రి అధికారులు తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో తొలగించారు. ట్రాక్టర్ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. బకింగ్ హామ్ కెనాల్ నుంచి నూతక్కి వరకు రోడ్డును విస్తరించాలని అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన వెంటనే విగ్రహాన్ని యథాస్థానంలో పెడతామని చెప్పారు.

మరోవైపు, రోడ్డు మధ్యలో కాకుండా, రోడ్డు పక్కన ఉన్న విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఇది మూడు అడుగులు ఉండేది. అయితే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ విగ్రహం స్థానంలో 15 అడుగుల సుందరమైన భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ విగ్రహాన్ని అందంగా అలంకరించారు. ఇంతలోనే విగ్రహాన్ని అధికారులు తరలించడం వివాదాస్పదంగా మారింది.

ఈ వార్త కూడా చదవండి: సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? ఇందులో నిజమెంత?

Advertisement

తాజా వార్తలు

Advertisement