Thursday, May 2, 2024

వైభవంగా దేవీ శరన్నవరాత్రులు

– గద్వాల, నిర్మల్‌లో శైలపుత్రిదేవి అవతారంలో.. – ఓరుగల్లులో బాలా త్రిపుర సుందరి
అవతారంలో దర్శనం – కాళేశ్వరంలో ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాల్లో తెల్లవారు జామునుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమి స్తున్నారు. ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తు న్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ నిర్వాహ కులు తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా నిభందనలను పాటిస్తూ భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీలతో పాటు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు సాగు తున్నాయి. అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలతో, మంగళ వాయిద్యాల మధ్య వెళ్లి స్వామివారి ఆనతి స్వీకరించారు. అనంతరం యాగశాల వద్ద గణపతి పూజ నిర్వహిం చారు. శైలపుత్రిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆల యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శైలపుత్రి అవ తారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.. కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించారు. సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో అమ్మ వారికి అభిషేకం నిర్వహిం చారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపే తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శన మిస్తున్నారు. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వ హించారు. బాలా త్రిపుర సుందరి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళి అమ్మవారు

వరంగల్‌ కల్చరల్‌, ప్రభన్యూస్‌: చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ మహానగరంలోని శ్రీ భద్రకాళీ దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా ఆలయప్రధానార్చకులు శేషగిరిరావు అలంకరించారు. ఉద యం బ్రహ్మచారిణిగా, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవపై ఊరేగించారు. అన్నపూర్ణేశ్వరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించు కోవడం వల్ల ఆకలిబాధలు దరిచేరవని, కష్టాలు తొలిగి సుఖశాంతులతో వర్దిల్లుతారని నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement