Thursday, May 9, 2024

లయకారుని ఆలయాలు

పరమ శివుని స్వయంభూ క్షేత్రాలు అయిన అమరా రామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమా రాం, క్షీరారామం దివ్య క్షేత్రాలుగా, పంచారామ క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు. పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలువ ఉన్నారు. రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలు స్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ. మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమార స్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు. నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా గునుపుండి (భీమవరం)లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజలందు కుంటు న్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూత నంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది. ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు. కార్తీక మాసంలో ఒకే రోజులో పంచారామాల్లోని పరమేశ్వరుని దర్శించి పూజిస్తే విశేష ఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పంచారామాలన్ని ఒకే రోజులో దర్శించా లనుకుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాల కొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించు కోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.


ఓం నమ: శివాయ … సర్వేజనా సుఖినోభవంత్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement