Thursday, May 2, 2024

రామకార్యార్థం… ఇంద్రరథం

లోక భీకరమైన రామరావణ యుద్ధాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న దేవ గంధర్వాదులు, రాముడు నేలపై నిలి చి రథికుడైన రావణునితో పోరాడుతున్నాడే అని విచారించారు. ఇంద్ర సారథి మాతలి ఇంద్ర రథంతో రణ భూమికి చేరి, రామునికి నమస్కరించాడు. ”మహాత్మా! ఇంద్రుడు దివ్య రథాన్ని, అభేద్యమైన కవచాన్ని, మహాశక్తి వంతమైన శక్తిని, దివ్య ధనుర్బాణాలను పంపాడు. నేను నీకు సారథ్యం చేస్తాను. ఈ రథాన్ని అధిరోహింపుము” అని మాతలి విన్నవించాడు. ప్రశస్తమైన దివ్య స్వర్ణ రథం, ప్రశస్త మైన సారథి, ప్రశస్తమైన దివ్యాస్త్రాలతో ప్రశస్తంగా ప్రకాశిస్తు న్న రథికుని చూసి దేవగణా లు సంతోషించి ప్రశంసించాయి.
రావణుడు ప్రయోగించిన గాంధర్వాస్త్రాన్ని రాముడు గాంధర్వాస్త్రంతో, దివ్యాస్త్రాలను దివ్యాస్త్రాలతో ఖండించా డు. రావణుడు ప్రయోగించిన రాక్షసాస్త్రాలు సర్వముఖాలతో విషాగ్ని జ్వాలలను గ్రక్కుతూ రాముని వైపు వచ్చాయి. రాముడు గరుడాస్త్రాలను ప్రయోగించాడు. అవి గరుడ రూపాలను తాల్చి, సర్వరూపాస్త్రాలను ధ్వంసం చేశాయి. రావణుడు ఉగ్ర మూర్తియై దివ్యాస్త్రాలతో సారథి మాతలిని గాయపరిచాడు. రథాశ్వాసాలను పీడించాడు. రావణుని ఉధృతిని, రాముని మృదుత్వాన్ని చూసి, దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు ఖిన్నులయ్యారు. రాముడు కన్నెర్ర చేసి భీకరమూర్తి అయ్యాడు. రామరావణులు ఉగ్రమూర్తులై ముల్లోకాలు గడ గడలాడునట్లు పోరాడారు.
రావణుడు రాముని చంప తలచి క్రూరాతి క్రూరమైన శూలాన్ని ప్రయోగించాడు. శూలం త్రిలోక భయంకర రూపా న్ని తాల్చి, రాముని వైపునకు దూసుకొని వచ్చింది. రాముడు తన బాణాలతో ఆ శూలాన్ని అణచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కాని శూలం ధాటికి అవి ధ్వంసమయ్యాయి. రాము డు ఇంద్రుడు పంపిన శక్తిని ప్రయోగించాడు. శక్తి నిప్పులు గ్రక్కుతూ శూలాన్ని భగ్నం చేసింది. ఆ దృశ్యాన్ని చూసి తేరుకొనే లోపల, రావణుని నొసటిని, రొమ్మును మూడు బాణాలతో రాముడు పీడించాడు. రావణుని శరీరం వివశమై మూర్ఛపోయాడు. రావణుని దురవస్థను గమనించి, సారథి సమయస్ఫూర్తితో రథాన్ని ప్రక్కకు తొలగించాడు. రావణుడు తేరుకొని సారథిని హుంకరించాడు. సారథి మృదు భాషణ ములతో రావణునికి నచ్చచెప్పాడు.
అవిశ్రాంతంగా పోరాడడం వల్ల రాముడు అలసిపోయా డు. చింతాక్రాంతుడయ్యాడు. వెంటనే అగస్త్య మహర్షి రాముని ముందు ప్రత్యక్షమయ్యాడు. ”రామా! చింతించ వద్దు. ఆదిత్య హృదయం అనే అతి రహస్య స్తోత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నిష్ఠతో ఆదిత్య హృదయాన్ని జపింపుము. నీవు శత్రువును అవలీలగా జయించగలవు. ఈ స్తోత్రాన్ని జపిస్తూ సూర్యనారా యణుని ఉపాసింపుము అని తెలిపి, అగస్త్యుడు రామునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించాడు.
రాముడు ఏకాగ్ర చిత్తుడై ఆదిత్య హృదయాన్ని జపించి, సూర్యుని ఉపాసించాడు. ఉపాసన వల్ల రామునికి ఆశావహ దృక్పథం అలవడింది. రాముడు పరమానందభరితుడ య్యాడు. నూతనోత్తేజం అతిశయించింది. రాముడు రణో త్సాహ పూరితుడయ్యాడు.

రావణ వధ
రాక్షసులు సాయుధులై ఉన్నారు. వానరుల చేతులలో బం డలు, చెట్లు, కొమ్మలు ఉన్నాయి. కాని వారు వాటిని ప్రయో గించాలనే స్పృహను కోల్పోయారు. రామరావణుల మధ్య జరుగుతున్న లోక భీకర సంగ్రామాన్ని చూసి నిశ్చేష్ఠులయ్యా రు. బొమ్మల వలె ఉండిపోయారు. రామ రావణులు పరస్పర విజయాభిలాషతో ఘోరాతి ఘోరంగా పోరాడుతున్నారు. రావణుడు బాణ పరంపరను రాముని ధ్వజంపై ప్రయోగించాడు. ఇంద్రుని ప్రభావం వల్ల ఒక్క బాణం కూడ దాన్ని తాకలేకపోయింది. రావణుడు తన రథ ధ్వజంపై మాటిమాటికి దాడి చేయడం చూసి, రాముడు ఒకే బాణంతో అతని రథ కేతనాన్ని నేల కూల్చాడు. తన రథ కేతనం నేలపాలు కావడం చూసి, రావణుడు క్రోధంతో అసహనంతో వివశుడయ్యాడు. రావణుడు క్రోధ పరవశుడై రాముని రథాశ్వాలపై బాణవర్షాన్ని కురిపించాడు. రథా శ్వాలు ఏమాత్రం తడబడలేదు. గతి తప్పలేదు. తన ప్రయ త్నం వ్యర్థం అవడంవల్ల రావణుడు మరింత రెచ్చిపోయా డు. బాణాలన్నీ నిష్ఫలం అవడంవల్ల కోపం అతిశయిం చింది. ఇక మాయా యుద్ధమే శరణ్యమని భావించాడు. రావణుడు మాయ ప్రభావంతో అనేకాయుధాలను కల్పించి ప్రయోగిం చాడు. రాముడు అతని మాయను ఛేదించి,తీవ్ర బాణజాలంతో వాటిని నుగ్గునుగ్గు కావించాడు. ఇరువురూ వారివారి సారథుల మీద రథాశ్వాల మీద బాణ వర్షం కురిపించారు.
వీరాధివీరులైన రామరావణులు తమతమ రథాలను చిత్ర చిత్ర గతులలో నడిపిస్తూ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. రాత్రింబవళ్ళు అవిరామంగా పరస్పరం పట్టు సాధించాలని యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. పరస్పరం కవ్విస్తూ తమ పౌరుష ప్రతాపాలను ప్రదర్శిస్తున్నారు. రాముడు ప్రయోగిం చిన నాలుగుబాణాలు రావణుని రథాశ్వాలను దెబ్బతీశాయి. గుర్రాలు చెదిరి వెనుకంజవేశాయి. రావణుడు రోషపూరితుడై సారథి మాతలిపై బాణ పరంపరను ప్రయోగించాడు. రాముడు అవమానాగ్ని తప్తుడై కోపోద్రిక్తుడై రావణునిపై తీవ్రంగా దాడి చేశాడు. ఆకాశానికి సాటి ఆకాశమే! మహా సముద్రానికి సాటి మహాసముద్రమే! రామరావణ సంగ్రా మానికి సాటి రామరావణ సంగ్రామమే! అనిపించింది.
శ్రీరాముడు మహాశక్తివంతమైన బాణంతో రావణుని తల నరికాడు. తల నేల పడటం దేవతలు చూశారు. వానరులు చూశారు. రాక్షసులు చూశారు! అత్యద్భుతంగా అతని మెడపై మరొక తల ప్రత్యక్షమయింది. ఒకదాని వెంట ఒకదానిని నరుకుతున్నాడు. ఒకదాని వెంట మరొక తల అతని మెడపై నిలుస్తున్నది. రాముడే కాదు సర్వ ప్రాణులు ఆశ్చర్య చకితు లయ్యారు. ఏమిచేయాలో రామునికి పాలుపోవడం లేదు. తన బాణాల శక్తి క్షీణించిందా? అనే సందేహం రాముని మన స్సును పీడించింది. దిక్కుతోచక ఆలోచనా నిమగ్నుడయిన రామునికి మాతలి కర్తవ్యాన్ని గుర్తుచేశాడు.
”రామా! రక్షాత్మకమైన వ్యూహాన్ని మాత్రమే అనుసరిస్తూ అతడు ప్రయోగించిన ఆయుధాలను అడ్డుకొంటున్నావు. నరుని చేతిలో రావణుని చావు తప్ప దు అనే బ్రహ్మ వాక్కును విస్మరించావా? ముల్లోకాలు ఆశతో ఎదురుచూస్తున్న సమ యం ఆసన్నమయింది. రావణునికి మృత్యువు ఆసన్నమ యింది. ఇంకా ఆలస్యం చేస్తావేమి? కానిమ్ము వెంటనే పని పూర్తి కానిమ్ము” అన్నాడు మాతలి.
రాముడు అంబుల పొది నుండి అగస్త్యుడు ప్రసాదించిన బ్రహ్మ నిర్మితమైన దివ్యాస్త్రాన్ని తీశాడు. వింటినారికి సంధించాడు. ఆకర్ణాంతం లాగి ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం రావణుని గుండెలో దూరి, భూమిని ఛదించుకొని పాతాళం చేరి, మరల రాముని అమ్ముల పొదిని చేరింది. దశకంఠుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
వానరుల సంబరం అంబరాన్ని అంటింది. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. దేవ దుందుభులు మ్రోగాయి. దేవతలు శుభం కలుగుగాక! అన్నారు. గంధర్వులు పాడారు. అప్సరసలు నాట్యమాడారు. పుష్ప వృష్టి కురిసింది.
దేవతల మనస్సులలో ప్రశాంతత వెల్లివిరిసింది. అష్ట దిక్కులు ప్రసన్నములయ్యాయి. ఆకాశం నిర్మలం అయింది. భూమి ఊపిరి పీల్చుకొని సర్దుకొనింది. వాయువులు స్వాభావికంగా వీచాయి. సూర్యకిరణాలు సహజంగా ప్రకాశించాయి. సుగ్రీవాది వానరుల సంతోషానికి అవధులు లేవు. విజయోత్సాహంతో అందరూ రాముని అభినందించి పూజించారు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement