Monday, April 29, 2024

రాఘవేంద్ర స్వామి ఆరాధన

శ్రీ విరోధి నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ నాడు 1671లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సశరీరంగా బృందావన ప్రవేశం చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సప్త రాత్రోత్సవాల పేరిట ఆరాధనోత్సవాలను నిర్వహిస్తారు.ఇవి మంత్రాలయ పీఠాధిపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవి ఏడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు.దేశ, విదేశాలలోని రాఘవేంద్ర స్వామి మఠాలలో ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరుగుతాయి.

తేదీలు :
ఆగష్టు 21 – ధ్వజారోహణం, ప్రధానోత్సవం, లక్ష్మి పూజ, ధయనోత్సవం, ప్రభ ఉత్సవం.
ఆగష్టు 22 – సాకోత్సవం, రజిత మంటపోత్సవం
ఆగష్టు 23 – రాఘవేంద్ర స్వామి పూర్వ ఆరాధన, సింహ వాహన సేవ
ఆగష్టు 24 – రాఘవేంద్ర స్వామి మధ్య ఆరాధన, పుష్ప అలంకరణ, రథోత్సవం
ఆగష్టు 25 – రాఘవేంద్ర స్వామి ఉత్తర ఆరాధన, మహారథోత్సవం
ఆగష్టు 26 – శ్రీ సుగుణ తీర్థుల ఆరాధన, అశ్వ వాహనం
ఆగష్టు 27 – సర్వ సమర్పణోత్సవం
అన్ని రాఘవేంద్ర స్వామి ఆలయాలలో ఆరాధన ఉత్సవాలు ఆగష్టు 23 నుండి 25 వరకు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement