Sunday, May 5, 2024

బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుడి మృతి

రామచంద్రమూర్తి- రావణాసురుడు మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. సర్వాస్త్రాలు తెలిసిన రామచంద్ర మూర్తి రాక్షసుడి నొసలు చీల్చేట్లు ఐదు బాణా లను వేయగా, రావణుడు వాటిని కొట్టి ఆసురాస్త్రాన్ని వేశాడు. దానికి విరుగుడు గా రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది రావణుడి అస్త్రాన్ని నాశనం చేసింది. ఇరు వురూ దివ్యాస్త్రాలతో పోరాడారు. రాముడితో సమానంగా యుద్ధం చేస్తున్న రావణుడిని చూసి స#హంచలేక లక్ష్మణుడు యుద్ధంలోకి దిగాడు. మండోదరి వివాహ సమయంలో మయుడు తన శక్తితో కల్పించి, రావణుడికి ఇచ్చిన ”శక్తి” ని రావణుడు రాముడి తమ్ముడు లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ బాణం లక్ష్మణు డి వక్షంలో నాటుకుంది. వెంటనే లక్ష్మణుడు మూర్ఛపోయి నేలకూలాడు. లక్ష్మణుడి రొమ్ములో నాటుకున్న రావణ శక్తిని అవలీలగా బయట కు లాగి తునకలు చేశాడు రాముడు. సుగ్రీవాంజనేయుల ను చూసి లక్ష్మణుడిని జాగ్రత్తగా చూసుకొమ్మని, తాను రావణుడిని సంహరిస్తానని చెప్తాడు. ఇక రాముడో, రావణుడో తేలిపోవాలి అని అంటా డు. ఇలా అంటూ శ్రీరాముడు బాణాలను రావణుడి దేహంలో గుచ్చుకునేట్లు వేశాడు. నిప్పులు కక్కే బాణాలను రావణుడి మీద వేయగా, వాడు ధైర్యం చెడి ఇక అక్కడ వుంటే చావడం ఖాయమని లంకలోకి పారిపోయాడు.
ఆ తరువాత తమ్ముడు లక్ష్మణుడి పరిస్థితి చూసి శ్రీరాముడు కన్నీరు కార్చాడు. రామ చంద్రమూర్తిని ఓదారుస్తూ సుశేణుడు, ఆయనతో లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడు చనిపోలేదని ఇలా చెప్పాడు. ”హనుమంతుడితో, వేగంగా దక్షిణ కూటం పోయి, లక్ష్మణుడి దేహంలో నాటుకున్న ములుకులు వూడతీయడానికి విశల్య కరణి ని, లక్ష్మణుడిని జీవిం ప చేయడానికి అక్కడే వున్న సవర్ణకరణిని, సంధాన కరణిని తీసుకునిరా” అని చెప్పాడు. వెంటనే హనుమంతుడు అక్కడికి పోయి, ఓషధులున్న స్థలాన్ని తెలుసుకోలేక, వెతకడానికి ఏమాత్రం ఆలస్యం చేయ కుండా, కొండనే పీక్కుని పోదామని నిర్ణయించుకుని, దాన్ని పెళ్లగించి, ఎత్తుకుని, ఆకాశానికి ఎగిరి, వానరుల మధ్యకొ చ్చాడు. హనుమంతుడు రాగానే సుశేణుడు ఆ మందు ల తీగెను కొండనుంచి బయటికి తీశాడు. సుశేణుడు తాను తీసిన ఔష ధులను లక్ష్మణుడికి వాసన చూపిం చాడు. వెంటనే అతడు సంతోషంగా మూర్ఛ నుండి తేరుకున్నాడు. ఇంతలో లంకకు పారి పోయిన రావణుడు ఒకరథా న్ని సిద్ధం చేసుకుని, యుద్ధానికి వచ్చి, శ్రీరాముడిని బాణాల తో కొట్టసాగాడు. శ్రీరా ముడు కూడా వాడికి తన బాణాలతో సమా ధానం చెప్పాడు. వారిరువురి మధ్య యుద్ధం జరుగు తున్న సమయంలో ఇంద్రుడి ఆజ్ఞాను సారం మాతలి రథాన్ని తీసుకుని రామచంద్ర మూర్తి దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కాడు. ”దేవా! నీ గెలుపు కోరి ఇంద్రు డు ఈ రథాన్ని పంపాడు. దీనిమీద ఎక్కు. రథంతో పాటు రావణుడిని చంపడానికి ఐంద్ర ధనస్సును, అగ్నితో సమాన మైన కాంతికల కవచాన్ని, సూర్య కాంతికల బాణ సమూహాన్ని, మెరుపు లాంటి ఈ శక్తిని పంపాడు. తీసుకో. నేను నీకు సారథిగా వుండగా ఈ రావణుడిని చంపు” అని అన్నాడు. ఆ రథం ఎక్కి యుద్ధానికి సిద్దమైన రాముడు, తన అన్ని అస్త్రాలనూ మనస్సులో తలచుకున్నాడు రామచంద్రుడు. ఆ అస్త్రాలను ఒకటి వెంట మరొకటి రావణుడి మీద ప్రయోగిం చగా వాటి దెబ్బకు వాడు బలహనుడై భయపడి తల్లడిల్లి పోయా డు. చేతిలో విల్లు పట్టుకోలేక పోయాడు రావణుడు. చావడానికి సిద్ధంగా వున్న రావణుడి దుస్థితి చూసిన సారథి ఇక వాడక్కడే వుంటే చావు ఖాయమని రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.
రావణుడి రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయినప్పుడు, ఆ తరువాత కార్యం ఏమిటా అని రామచంద్రమూర్తి ఆలోచన చేస్తున్నప్పు డు, అగస్త్యుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు. అది చదువుతే విజయం చేకూరుతుందని చెప్పాడు.
యుద్ధభూమికి దూరంగా రథాన్ని తోలుకుపోయిన సారథిని చూసి రావణుడు (మరణం సమీపిస్తుండగా) కళ్లెర్రచేసి, కోపంగా దూషించాడు. రావణుడు మేలు కోరి అలా చేసిన సారథిని పరుషం గా మాట్లాడడంతో సారథి హతమైన మాటలతో జవాబిచ్చాడు. ఆయన మేలు, క్షేమం కోరి అలా చేసానన్నాడు. సారథి మాటలకు సంతృప్తి చెందిన రావణుడు రథాన్ని శ్రీరాముడికి అభిముఖం గా పోనిమ్మని అంటాడు. సారథి రా వణుడి ఆజ్ఞానుసారం రథాన్ని శ్రీరాముడి వైపుకు తీసుకుపోయా డు. ఇంద్రుడు తనకు పంపిన విల్లు తీసుకుని, కోపంతో, సూర్య కాంతితో సమా నమైన కాంతికల వాడి బాణాలను రావణాసురుడి మీద వేశాడు రామ చంద్రమూర్తి. రామరావణులు ఒకరినొకరు చం పాలనే కోరికతో యుద్ధం చేస్తుంటే దేవతలు ఆకాశాన గుంపులుగా వీక్షించారు. రామరావణ యుద్ధా నికి రామరావణయుద్ధమే సమా నమని నిర్మల మనస్సుతో వారం తా ఆశ్చర్య పడ్డారు. తీవ్రమైన కోపంతో భయంక రాకారుడై రామచంద్ర మూర్తి బాణాన్ని సంధించి రావణుడి శిరస్సు నరికాడు. రావణుడి తల కిందపడ్డది కాని వెంటనే మరొక తల మొలిచింది. అలా తల నరక గానే మరొక తల మొలిచింది కాని వాడు చనిపోయే విధం రాముడికి కనబడలేదు. ఇదేమి చిత్రమని రాముడు ఆలోచన చేయసాగాడు. అప్పుడు మాతలి శ్రీరాముడితో బ్రహ్మాస్త్రం వేయమనీ, రావణుడు ఏ గడియలో చస్తాడో అని దేవతలు చెప్పారో ఆ కాలం ఇప్పుడు సమీపించిందనీ చెప్పాడు.
మాతలి ఇలా చెప్పగానే బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి వింట సంధించాడు. అమితమైన వేగంతో రాముడు బ్రహ్మాస్త్రాన్ని బ్రా#హ్మణ #హంతకుడైన రావణుడి మీద వేశాడు. అది పోయి రావణుడి రొమ్ముమీద పడింది. పడగానే ఆ గొప్ప అస్త్రం రావణాసు రుడి రొమ్ము చీల్చి, ఆ నెత్తురులో స్నానం చేసి, వాడి దే#హం నుండి ప్రాణాలను వెడలగొట్టి, పనంతా అయిపోయిన తరువాత భూమిలో దూరి వెలుపలికి వచ్చి, వినయంగా రాముడి అమ్ముల పొదిలో ప్రవేశించింది. రావణుడు చావగానే ఆయన దే#హం ప్రాణాన్ని వదిలినట్లే, విల్లు, బాణాలు కూడా రావణుడిని వదిలి నేలమీద పడ్డాయి. రావణుడి దేహం అలా శక్తిపోయి నేలమీద పడిపోయింది. తమ ప్రభువు చావడం చూసి చావకుండా మిగిలిన రాక్షసులు రామ జయంతో సంతోషించే వానరులు తరుముతుంటే లంకలోకి పారిపోయారు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement