Friday, April 26, 2024

బ్రహ్మాకుమారీస్‌.. పేరు, ప్రఖ్యాతి, గౌరవం కావాలనే ఆకాంక్ష(ఆడియోతో..)

కొంతమంది ఈశ్వరీయ జ్ఞానం సహజయోగశిక్షణ లభించిన తరువాత ఈశ్వరీయ సేవ కూడా చేస్తారు. కానీ దానితో బాటు తాము చేసిన పనికి ప్రతిఫలంగా పేరు – కీర్తి పొందాలనే ఆకాంక్ష కొందరు పెట్టుకుంటారు. వినయ వినమ్రతలతో ఒక సేవధారిగా, నిమిత్త సాధనంగా భావించుటకు బదులుగా తానొక గొప్ప తెలివిగల వానిగా ఎంతో యోగ్యుడైన కార్యకర్తగా భావించి ప్రతిష్టి, హంగులు, గౌరవం పొందాలనే ఆకాంక్షలు మనసులో పెట్టుకొంటాడు. ఒక వేళ వారికి ఈ కోరిక నెరవేరినట్లయితే ఇంకా ఎక్కువ దాంట్లోనే అధికంగా చొక్కుకొని పోతాడు. అంటే ఎక్కువ కీర్తి పొందాలనే లాలసతో ఇంకా ఎక్కువ పనులతో నిమగ్నమవుతారు. దీని వలన వారి వద్ద యోగాభ్యాసం కోసం ఏకాంతంగా, ప్రశాంతంగా కూర్చొనే సమయం మిగలదు. ఆత్మ చింతన ఆత్మ నిరీక్షణ అలవాటు ఉండదు. అతనికి ఒకవేళ గౌరవం, హోదా లభించకపోతే కోపం వస్తుంది. ఖిన్నుడై మనం చేసిన పనికి విలువలేదు. ఎవరికీ దాని వైపు ద్యాసయే ఉండదు” అని ఈవ్వరీయ సేవను రోజు8 రోజుకూ వదిలి పెట్టుతుంటాడు. అదే విదంగా తన బుద్ధిని సేవాకార్యంతో ఖాళీ చేసకొని వ్యర్ధ సంకల్ప వికల్పాలలో చిక్కుకొని తన స్థితిని పతనం చేసుకొంటాడు. ఇంతే కాకుండా తన ప్రయత్నానికి తన సేవా కార్యానికి వెంటనే ఫలం దర్శించాలనుకొంటాడు. ఫలం లభించకపోయినా, ప్రత్యక్షతకు కొంచెం సమయం పెట్టినా ఓర్పు లేక అసంతృప్తితో కొర్యవ్యవహారమును కర్తవ్యమును విడిచి పెడ్తాడు. పైగా ”ఏం ఫలితం లేనపుడు చేసి ఏం లాభం” అని అనడం మొదలుపెడతాడు. ఈ విధంగా అతడు నిరుత్సాహం, నిరాశ, పురుషార్థ హీనత చెంది తన ధారణలో బలహీనుడై తన జీవితంలో అధోగతి పాలవుతాడు. ధారణలో బలహీనుడై తన జీవితంలో అధోగతి పాలవుతాడు. కావున మనపైన ఎవరిదైన అంకుశం అంటే అజయాయిషీ ఉంచుకొనుట చాలా అవసరం. కొద్ది రోజులు గడవగానే మనస్థితిని చెకింగ్‌ చేసికొనాలి. ఆధ్యాత్మిక ఔషధి మరియు ఉపచారాల ద్వారా తనను తాను సరిచేసికొంటూ ఉండాలి. పేరు ప్రఖ్యాతులు, గౌరవభావాలు కావాలనే కోరిక మన పురుషార్థంలో చాలా ఆటంకంగా తయారవుతుంది. దీనిని మనం త్యాగం చేయాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement