Monday, July 26, 2021

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కేయూ విద్యార్థులు

సీఎం కేసీఆర్‌ వరంగల్ జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్‌ను కేయూ జేఏసీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. ‘కేసీఆర్ డౌన్‌డౌన్.. ఖబడ్దార్ కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. వెంటనే తేరుకున్న పోలీసులు.. విద్యార్థులను అరెస్ట్ చేశారు. వరంగల్ కలెక్టరేట్ ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా.. విద్యార్థులు రావడం చర్చనీయాంశమైంది. కేయూ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటనతో ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటనలో అవాంఛనీయ ఘటనల జరగొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అన్ని సంఘాల విద్యార్థి నాయకులను ముందస్తు హౌజ్ అరెస్ట్ చేశారు. అయినా విద్యార్థులు కాన్వాయ్‌ను అడ్డుకోవడం సంచలనంగా మారింది. గతంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు కూడా విద్యార్థులు ఇదే విధంగా అడ్డుకున్నారు. అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News