Wednesday, May 1, 2024

పోలీసుల అదుపులో దర్శన దళారులు

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులను మోసం చేసిన ఇద్దరు దళారులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిసు ్తన్నారు. శ్రీవారి దర్శనం టికెట్లు లేకుండా స్వామివారి దర్శనార్ధం తిరుపతికి వచ్చి న వెంకటేశ్‌ అతని కుటుంబ సభ్యులు ఎస్‌డి టోకెన్ల కోసం ప్రయత్నించగా టోకెన్లు దొరక్క పోవడంతో స్వామివారి దర్శనార్ధం అలిపిరి వద్దరు చేరుకోగా ఇద్దరు దళారులు వారికి చైర్మెన్‌ కోటాలో దర్శనం కల్పిస్తామని, 11 మందికి గాను 16 వేల రూపాయలకు డీల్‌ కుదుర్చుకుని అడ్వాన్సుగా 8 వేల రూపాయలు తీసుకుని టీటీ డీ చైర్మన్‌ పేరుతో భక్తులకు ఫేక్‌ మెసేజ్‌లు పంపగా దళారులు పంపిన మెసేజ్‌తో భక్తులు చైర్మెన్‌ కార్యాలయానికి వెళ్ళగా అక్కడి సిబ్బంది ఇవి నకిలి మెసేజ్‌లని భక్తులకు చెప్పడంతో తమకు జరిగిన మోసం పై భక్తులు పోలీసులకు పిర్యాదు చేశా రు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్‌, నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా వీరు పలువురు భక్తులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement