Sunday, April 28, 2024

పుష్పయాగంతో పులకించిన తిరుమల

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్ష త్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువా నలు వెదజల్లే పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వ హించారు. రంగు రంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడిం చింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో జహవర్‌రెడ్డి పాల్గొ న్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవంలో అర్చకుల వల్లగాని, ఉద్యోగుల వల్లగాని, భక్తుల వల్లగాని జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహి స్తారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలు వ, మొగలి రేకులు, మాన సంపంగి పుష్పాలు, తుల సి, మరు వం, దవనం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రా లతో అర్చించారు.ుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. అనంతరం స్వామి వారు ఆలయ నాలుగుమాడవీధులలో ఊరేగి భక్తుల ను అనుగ్రహించారు. కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్ర మైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. పుష్పయాగానికి 8 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందిం చారు.

ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్‌కు సన్మానం
శ్రీవారి పుష్ప యాగాన్ని ఘంగా నిర్వహించేం దుకు దాతల నుంచి పుష్పాలను సేకరించేందుకు కృషి చేసిన టిటిడి ఉద్యానవన విభాగం డిప్యూటి డైరెక్టర్‌ శ్రీ నివాసులును శ్రీవారి ఆలయ అధికారులు శాలు వతో ఘనంగా సన్మానించారు.పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement