Saturday, April 27, 2024

పరమహంస సూక్ష్మబోధ

శ్రీరామచంద్రుడు కులదైవంగా భావించి పూజించే చటర్జీల వంశంలో జన్మించిన గదాధర్‌ కాలాంతరంలో శ్రీరామకృష్ణ పరమహంసగా ఈ పుణ్యభూమిలో నడయాడారు. బాల్యం నుండి తన దివ్యత్వాన్ని ప్రద ర్శించి ఎందరో మహోన్నత శిష్యులను జాతికి అందించిన ఆధ్యాత్మిక చక్రవర్తి శ్రీరామకృష్ణులు. వారిలో స్వామి వివేకానంద ఒక మణిపూస. నేటికీ ఆ పరమ హంస పరంపర కొనసాగిస్తున్న బహుళసేవ మనందరికీ విదితమే! మానవులు అనుసరించవలసిన ధర్మాలను అత్యంత సూక్ష్మంగా అందించిన మహనీయు డు పరమహంస.
ఎందరో సుప్రసిద్ధ వ్యక్తులు ఆయనను కలుసుకుని, ముందు ఒక విచిత్ర స్వభావిగా భావించి తుదకు ఆయన అంతరంగ మహిమకు దాసులయ్యేవారు. ఒకసారి ప్రసిద్ధ తత్త్వవేత్త, సంఘసంస్కర్త అయిన కేశవచంద్రసేన్‌ శ్రీరామకృష్ణు లను కలుసుకున్నారు. భగవంతుని ఉనికిపై వారి మధ్య సంభాషణ జరిగింది. రామకృష్ణులు ఇలా విశదపరచారు ”ఒకసారి మీ కలకత్తా నివాసి దేవుడు లేడు అని విశ్వసించేవాడు మేడమెట్లు ఎక్కుతూ చివరి మెట్టు మీద కాలు పెడుతూ అ య్యో! నాది! నావాళ్ళు! నా పక్క! అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. వైద్యుడు వచ్చేలోగానే తుదిశ్వాస విడిచాడు. ఇటువంటి వాళ్ళా దేవుడు లేడు అనడం! నీకు ఆశ్చర్యంగా లేదా!” అని అడిగారు. ఏ క్షణంలో ఏమి జరుగు తుందో తెలియని వాళ్ళం దేవుడు లేడని ఎలా చెప్పగలం అని దీని భావం.
అయస్కాంతం ఇనుమును ఆహ్వానించదు, ఆకర్షిస్తుంది. అలాగే భగవం తుడు మనలను ఆహ్వానించడు, ఆకర్షిస్తాడు. కాని తుప్పు పట్టిన ఇనుము త్వర గా ఆకర్షింపబడదు. మనసుకు అంటిన మాలిన్యమనే అజ్ఞానపు తుప్పు కన్నీటి తో వదిలించుకున్నప్పుడు మాత్రమే అది భగవంతుణ్ణి హత్తుకుంటుంది.
అశ్వనీకుమార్‌, మహారాజా యతీంద్ర మోహన ఠాగూర్‌, బాబూ కృష్ణ దాస్‌ పాల్‌, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ మొదలగు ఘనులు శ్రీరామకృష్ణులను కలుసుకొని వారి నుండి ఎన్నో దివ్యమైన విషయాలు, అనుభూతులు గ్రహించా రు. మానవుడి కర్తవ్యం గురించి సంభాషించినప్పుడు, సంసారంలో మునిగిన వారికి ముక్తి, మోక్షం ఎక్కడిది? భగవంతునిపై చింతనకు ఏకాగ్రత ఎలా లభి స్తుంది? అను ప్రశ్నలు ఉదయించాయి. ధర్మరాజు సైతం నరకాన్ని సందర్శించ వలసి వచ్చింది అని రామకృష్ణులతో అన్నప్పుడు ఆయన చిరాకుపడుతూ ”ధర్మరాజు విషయంలో నరక సందర్శన ఒక్కటే ప్రధానంగా కనపడుతోందా? అతని సత్యనిష్ట, క్షమాగుణం, ధైర్యసాహసాలు, ఓర్పు, సహనం, వివేకం, వైరా గ్యం, ముఖ్యంగా భగవంతునిపై నమ్మకం, భక్తి, సాధన, విజయాలు వీటి గురించి మాట్లాడరా?” అని పరోక్షంగా ధర్మరాజు యొక్క సుదీర్ఘ జీవన గమనా న్ని అందులోని మర్మాన్ని సూక్ష్మంగా తెలిపారు.
ఒకసారి వైరాగ్యం గురించి చర్చ సాగింది. వైరాగ్యమనే వెర్రి వలననే భార తదేశం నాశనమయింది, దాస్యంలో మ్రగ్గిపోయేలా చేసింది. పరోపకారం, విద్యాప్రదానం, దేశ ప్రజల లౌకిక స్థితిని బాగుపరచడం ఇవే మన కర్తవ్యాలు. పరమార్థం, వైరాగ్యం అంటూ కూర్చుంటే మనం బలహీనులమవుతాం అని చర్చలో ప్రస్తావించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు వేదాలు, శాస్త్రాలు మహో న్నతమయినవి ఏవో రెండు ఇంగ్లీషు పుస్తకాలు చదవగానే ప్రపంచ తత్త్వం అంతా అదే అన్నట్లు, అంతా తెలిసిపోయినట్లు భావించకండి. గంగానది అప్ప టికప్పుడు పుట్టే చిన్నచిన్న యండ్రకాయ పిల్లలు అంటే పీత పిల్లల కంటే అల్పమయిన వాళ్ళలా చర్చించకండి. లోకోపకారం అంటే కొందరికి భోజనం పెట్టడం, చదువు చెప్పడం, రోగులకు చికిత్స చేయడం, రోడ్లు వేయించడం, బావులు త్రవ్వడం ఇవేకాదు, ఇవి చేయండి మంచి పనులే! కాని ఆ శక్తిని, యుక్తిని అందించే ఈశ్వరుణ్ణి మరచిపోకండి, అహంకారాన్ని విడిచిపెట్టి ఆ శక్తి ని, అధికారాన్ని ఆనందమయి అయిన ఆ జగదీశ్వరి నుండి పొందండి అని ఉద్భోదించారు. ఇక్కడ మానవుడిని ఈ మహావిశ్వంతో పోల్చి తమ ఉనికిని గుర్తించి అహంకార రహితులవ్వాలని దీనిలోని ఆంతర్యం.
శ్రీరామకృష్ణుల సంభాషణలు, ఉపదేశాలు లోక సేవాతత్త్వాన్ని తెలియ జేస్తాయి. మానవసేవే మాధవసేవ అనుకోవడంతో సరిపోదు జ్ఞానభక్తి వైరా గ్యాలను అవలంబించి నిరహంకారి అయితేనే ఆ స్వచ్ఛభావం అలవడుతుం ది, లేకపోతే బాహ్య ఆడంబరాలతో సేవ నిష్ఫలం అవుతుంది. దానివలన ఎటు వంటి ప్రయోజనం ఉండదు.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌తో జరిగిన సంభాషణ ఆద్యంతం మనోహరం, ఆత్మోద్ధారకంగా ఉంటుంది. కాలువలు, వాగులు, నదులు చూడడంతో సరిపో దు సముద్రాన్ని చేరినపుడే సర్వం అవగతమవుతుంది. సాత్త్విక కార్యాలు రాజసి క అంశతో చేయడం సరిఅయినదే, సత్త్వగుణం వలన దయ జనిస్తుంది. దయవ లన చేసే కార్యం రాజసికమైనా మూలం సత్త్వం కనుక దోషం లేదు. విద్యాదా నం, అన్నదానం చాలా మంచివే! నిష్కామంగా ఇవి చేయగలిగితే భగవద్దర్శ నం లభిస్తుంది. పేరు ప్రతిష్టలకో, పుణ్యానికో చేసేవి సంతృప్తిని నిజంగా ఇవ్వవు. పండితులు అయినంత మాత్రానా వారి భావం పండకపోతే ఎందుకూ కొరగా రు. రాబందు ఎంతో ఉన్నంతలో ఎగురుతున్నప్పటికీ దాని దృష్టి దిగువనున్న కళేబరాలపై ఉంటుంది. పేరుకు పండితులే కానీ కామినీ కాంచనాలపై వారి ఆసక్తి ఉంటుంది. దయ, భక్తి, వైరాగ్యం ఇవన్నీ విద్యావిభూతులు. ‘బ్రహ్మం’ విద్యకు, అవిద్యకు అతీతం. అది మాయాతీతం, అవాఙ్మనసగోచరం. వేదాలు, పురాణాలు, తంత్రాలు, మంత్రాలు, షడ్దర్శనాలు ఇవన్నీ నోటితో ఉచ్చరించబడి ఉచ్ఛిష్టమైపోయాయి. ఉచ్చిష్టము కానిది ఒక్కటే! అదే ‘బ్రహ్మం’.
శుష్క పాండిత్యం నిరర్ధకం. భగవంతుని పొందే మార్గం తెలుసుకోడానికే శాస్త్రపఠనం. ‘గీత’ బోధించినది ”తాగీ” అంటే ”త్యాగి” అని అర్ధం. ఓ జీవులా రా! సకలం త్యజించి అనన్య భక్తితో భగవంతుని సాక్షాత్కారానికై ప్రయత్నం, సాధన చేయండి. మనస్సు నుండి విషయాసక్తిని, కర్మఫలాసక్తిని విడిచిపెట్టాలి.
శాస్త్రాలెన్నో సద్విషయాలను బోధిస్తాయి. కాని భగవంతుని సాక్షాత్కా రం, ఆయన యందు త్రికరణ శుద్ధితో భక్తి లభించనిదే ఎంత చదివినా, సాధన చేసినా నిష్ప్రయోజనం. ఈశ్వరాదేశం పొందాలంటే విశ్వాసంతో సాధన చేయాలి. అప్పుడే పరమాత్మ అవగతమవుతాడు. అప్పుడు అందరినీ ఆకర్షి స్తారు. ఈశ్వరాజ్ఞను సఫలం చేస్తారని శ్రీరామకృష్ణ పరమహంస విశదీక రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement