Friday, April 26, 2024

నేటి రాశి ప్రభ (4-4-2021)

మేషం:
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం:
ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మిథునం:
మిత్రుల నుంచి సమస్యలు. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

కర్కాటకం:
బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

తుల:
ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం:
ఏ పని చేపట్టినా నిరాశపరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనుస్సు:
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి లాభం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

మకరం:
ప్రయాణాలలో ఆటంకాలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఒప్పందాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కుంభం:
మిత్రులు సహకరిస్తారు. పనుల్లో విజయం. భూయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం:
అనుకున్న వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement