Saturday, April 27, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గ‌శిర మాస విశిష్ట‌త

యద్దుర్లభం చ దువష్ప్రాప్యం త్రిషు లోకేషు మానద |
తత్సర్వం ప్రాప్ను యాన్మర్త్య: సహో మాసే న సంశయ: ||

యద్యప్యేతేషు కామేషు సక్తాయే మానవాస్సుత |
తుష్టా హ్యంతే చతుర్వక్త్ర నకామార్హా మహా భుజ ||

సుదుర్లభాహి సద్భక్తి ర్మమ వశ్యకరీ శుభా |
సావై సాంప్రాప్యతే పుత్ర సహోమాసే శ్రుతే తథా ||

మమ ప్రీతికరం మాసం సర్వదా మమ వల్లభమ్‌ |
సర్వం సంప్రాప్యతేముష్మాత్‌ మత్ప్రసాదాచ్చతుర్ముఖ! ||
లభించ శక్యము కానిది పొందశక్యము కానిది మూడు లోకములలో నున్నదేదైననూ మార్గశీర్ష మాసమున అవన్నీ లభించును. సుత! ఈ కామనుల యందు ఆసక్తులైన మానవులైననూ నా ఆరాధనతో అంత్యకాలమున తుష్టి పొందినచో వారు కామార్హులు కాజాలరు. నన్ను వశము చేయునది శుబకరమైన సద్భక్తి లభించును. మార్గశీర్ష మాసమునకు ప్రీతికరమైనది. అన్నివేళలా నాకు ప్రియమైనది. ఈ మార్గశీర్ష మాస వ్రతాచరణ వలన కలిగిన నా అనుగ్రహము వలన అన్నీ లభించును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement