Thursday, May 2, 2024

ధర్మం – మర్మం : వినాయక రహస్యం (ఆడియోతో..)

దేవీ పుత్రుడు గజానడయిన వృత్తాంతం…
శంకరుడు త్రిశూలంతో గణపయ్య శిరస్సు తీసి గజశిరస్సును ఏర్పరిచి అందరికీ కరచరణాది ఆకారము ఒక్కటేనని ఒక తల మాత్రమే పేరును మారుస్తుందని తెలియజేశాడు. మరికాస్త లోతుకు వెళితే తల ఏదైనా తలలోని తలపులను బట్టి పేరు వస్తుంది కావున భగవంతుడిని తలచుకుంటున్న ఒక రాక్షసుడి తలను ఆ జగత్పతి తన కుమారునికి అతికించాడు. రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం అనేవి తలపులను బట్టే కాని తలను బట్టి కాద ని లోకానికి సందేశమందించాడు శంకరుడు. తన తల లోకపూజ్యం కావాలని, సదాశివ ధ్యానం చేయాలని కోరుకున్న వాడు కావున దేవీపుత్రునికి రాక్షసుడైన గజాసురుని శిరస్సును అమర్చారు. కొన్ని సన్నివేశాలను లోతుగా విశ్లేషిస్తే అనంతమైన సత్యాలు ఆవిర్భవిస్తాయి. భగవంతుడ్ని తనలోనే దాచుకోవాలన్న స్వార్థం కలిగిన ఒక రాక్షసుడికి భగవంతుడు వచ్చి తన కడుపున చేరగానే తన తల లోకపూజ్యం కావాలనే ఆలోచన కలిగింది. ఇంతమంచి ఆలోచన కలిగిన ఆ దేహం దేవాలయమైంది. దేవాలయానికి గోపురం ఎలాగో దేహానికి తల అలాంటిది.
దేవాలయ గోపురాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణాలు చాటుతున్నాయి. మనలోనే భగవంతుడున్నాడనే భావన స్వార్థాన్ని పారద్రోలి పరమార్థాన్ని సూచిస్తుంది. భగవంతుని ధ్యానం ఏదో ఒక రీతిలో భగవత్సంబంధానికి, లోకకళ్యాణానికి ఏవిధంగా దారి తీస్తుందో తెలియజేయటానికి గజానన అవతారం ఒక పెద్ద నిదర్శనం.


శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement