Saturday, May 18, 2024

ధర్మం – మర్మం : ధాత్రీ వైభవం (ఆడియోతో…)


శ్రావణ మాసం సందర్భంగా ధాత్రీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

స్మశానేపి యదా మృత్యు: తస్యస్యాత్‌ దైవ యోగత:
గంగామరణజం పుణ్యం సంప్రాప్నోతి న సంశయ:
తం దృష్ట్వా పాపి న సర్వే పాపజాలై: సుదారుణౖ:
సద్యఏవ ప్రముచ్యంతే జన్మ కోటి కృతైరపి

ధాత్రీ ఫలమాలను బ్రాహ్మణునికి ఇచ్చిన వారు, తానుగా ధరించిన వారు దైవ యోగమున స్మశానమున మరణించిననూ గంగానది తీరమున మరణించినా కలుగు పుణ్యము అతనికి కలుగును. ధాత్రీ మాలను ధరించిన వారిని చూచిన పాపాత్ములు కూడా తాము కోటి జన్మలలో చేసిన భయంకరమైన పాపజాలము నుంచి విముక్తిని పొందుదురు. ధాత్రీ ఫల రసమును ప్రతి దినము సేవించు వారు అనంతమైన పుణ్య ఫలమును పొందెదరు. సర్వదేవతలకు నిలయమైన ధాత్రీ వృక్షమును నరికిన వారు శ్రీహరి శరీరమును దెబ్బ కొట్టినవారగుదురు అని అనడంలో సంశయము లేదు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement