Thursday, May 2, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో..)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యో దదాతి హరేర్ధూపం తులసీ కాష్ట సంభవం
శతక్రతు సమం పుణ ్యం లభతే గోశతం ఫలమ్‌
నైవేద్య పచతే యస్తు తులసీ కాష్ట వహ్నినా
మేరు తుల్యం భవేత్‌ దత్తమ్‌ తదన్నం కేశవస్యహి
తులసీ పావ కేనాధ యో దీపం కురుతే నర:
దీప లక్ష సహస్రాణాం పుణ్యం స లభతే ఫలం
నతేన సదృశో లోకే వైష్ట వో భువి దృశ్యతే

తులసీ కాష్టములో పుట్టిన ధూపమును శ్రీహరికి వేసిన వారికి నూరు యాగములు చేసిన ఫలము, నూరు గోవులను దానం చేసిన ఫలము లభించును. తులసీ కాష్ట సం భవమైన అగ్నితో వండిన నైవేద్యమును శ్రీహరికి నివేదన చేసినచో అది ఎంత కొంచమైనా మేరు పర్వత పరిమాణముతో సమానమైన ఫలము లభించును. తులసీ కాష్ట సంభవమైన అగ్నితో శ్రీహరికి దీపము వెలిగించినచో పదికోట్ల దీపములను వెలిగించిన ఫలితము లభించును అంతేకాకుండా అతనితో సమానుడైన విష్ణు భక్తుడు ఈ ప్రపంచములో మరొకరు ఉండరు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement