Thursday, May 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 17
17.
ఉత్తమ: పురుషస్త్వన్య:
పరమాత్మేత్యుదాహృత: |
యో లోకత్రయమావిశ్య
బిభర్త్యవ్యయ ఈశ్వర: ||

తాత్పర్యము : ఈ ఇరువురు గాక మూడులోకములందును ప్రవేశించి వాటిని భరించు సాక్షాత్తు అవ్యయ ప్రభువును, పరమాత్ముడును అగు ఉత్తమపురుషుడును కలడు.

భాష్యము : ఈ శ్లోకములోని భావము ఉపనిషత్తు వాక్యమైన ‘నిత్య నిత్యానాం చెతనస్చేతనానాం’ ను చక్కగా వివరిస్తున్నది. దీని అర్థమేమనగా : బద్ధ ముక్త జీవులందరికీ ఉత్తమ జీవుడు దేవాది దేవుడు, భగవంతుడు. అతడు మిగిలిన జీవరాశులన్నింటినీ పోషించుచూ ఉండును. వారి ఆనందమునకు కావలసిన సదుపాయాలను వారి వారి కర్మానుసారము ఏర్పాటు చేయుచుండును. అతడు పరమాత్మ రూపములో అందరి హృదయాలలోను స్థితుడై ఉండును. అతడు పరమాత్మను అర్థము చేసుకోగలిగినవాడు మాత్రమే సంపూర్ణమైన శాంతిని కలిగి ఉంటాడు గాని మిగిలిన వారు కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement