Friday, May 17, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 18

18.
గతిర్భర్తా ప్రభు: సాక్షీ
నివాస: శరణం సుహృత్‌ |
ప్రభవ: ప్రలయ: స్థానం
నిధానం బీజమవ్యయమ్‌ ||

తాత్పర్యము : గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, నిధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.

భాష్యము : ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్మమును తెలుసుకొని ఉండవలెను. లేదంటే మనము చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే కాగలవు. వేరు వేరు దేవతలను పూజించి వేరు వేరు లోకాలకు వెళ్ళవచ్చునేమో గాని అవన్నీ కృష్ణుని చేరుటలో మొదటి మెట్టు మాత్రమే. అయితే ఇవన్నీ కృష్ణుని చేరుటలో పరోక్ష మార్గములు. అదే మనము కృష్ణున్ని స్వయముగా పూజిస్తే సమయాన్ని, శ్రమను, పొదుపు చేసుకున్న వారమవుతాము. పరమాత్మగా మన హృదయము నందు ఉండి అన్నింటినీ గమనిస్తున్న కృష్ణుడే నిజమైన సాక్షి. మన నివాస స్థానాలు, దేశాలు, మరియు లోకాలు, ఇవన్నీ కృష్ణుని యందు భాగములు మాత్ర మే. మన కష్టాలను తీర్చ గల వ్యక్తి కాబట్టి, కృష్ణుడే మనము శరణు పొందవలసిన వ్యక్తి. మన తాత ముత్తాతలకూ మూలము కృష్ణుడే కనుక ఆయనను మించిన శ్రేయోభిలాషి మనకు ఎవరుంటారు?

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement