Sunday, April 28, 2024

అన్నమయ్య సంకీర్తనలు

పరిపూర్ణ గరుడాద్రి

పరిపూర్ణ గరుడాద్రి పంచాననం
పరమం సేవే పంచాననం || ||పరిపూర్ణ గరుడాద్రి||

క్రూరదంష్ట్రాగ్నికరణ ఘోర పంచాననం
పారీణ చక్రధర పంచాననం
వీరపంచాననం విజయపంచాననం
భార భూభారహర పంచాననం || ||పరిపూర్ణ గరుడాద్రి||

దివిజపంచాననం తీవ్రనఖకాననం
భవనాశి నీతీర పంచాననం
కువలయాకాశసంఘోష పంచాననం
పవిశబ్ద దంతరవ పంచాననం || ||పరిపూర్ణ గరుడాద్రి||

శ్రీ వేంకటాఖ్య ఘనశిఖరి పంచాననం
పావనం పంచముఖ పంచాననం
సేవిత ప్రహ్లాదసిద్ధి పంచాననం
భావితం శ్రీ యుక్త పంచాననం || ||పరిపూర్ణ గరుడాద్రి||

Advertisement

తాజా వార్తలు

Advertisement