Friday, March 29, 2024

మటన్ షాప్ కు సోనూ పేరు…నేను శాకాహారిని అంటూ ట్వీట్!!

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది వలస కూలీల కు సహాయం చేసి వారి పాలిట దేవుడు అయ్యాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ పై అభిమానంతో కొంతమంది వారి పిల్లలకు సోనుసూద్ పేరును పెట్టుకున్నారు. అలాగే కొంతమంది వ్యాపారాలకు సోనూసూద్ పేరును పెట్టుకున్నారు. మరి కొంతమంది ఏకంగా గుడిని కూడా కట్టారు.

తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ఓ వ్యాపారి సోను సూద్ పై అభిమానంతో మటన్ దుకాణానికి పేరును పెట్టారు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్ నేను శాఖాహారిని అటువంటిది నా పేరున మటన్ షాప్…అంటూ ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మీ దుకాణానికి నేను ఏమైనా సహాయం చేయగలనా అంటూ ట్వీట్ చేశారు సోనూ.

Advertisement

తాజా వార్తలు

Advertisement