Monday, April 29, 2024

అన్నమయ్య సంకీర్తనలు

పరతత్వంబగు బాలుడు

పరతత్త్వంబగు బాలుడు
పరిపరి విధముల బాలుడు || ||పరతత్వంబగు బాలుడు||

చద్దుల మూటలు చంకలవ్రేలెడి
ముద్దుల పడుచుల మూకలతో
పెద్దరికంబున పేయల గాచిన
బద్దుల నటనల బాలుడు || ||పరతత్వంబగు బాలుడు||

వెన్నలు తాకగ వేట్లాడుచును
సన్నపు పడుచుల సంగడిని
కన్నెలు దూరగ కలకల నవ్విన
పన్నిన మాయల బాలుడు || ||పరతత్వంబగు బాలుడు||

బచ్చెన రూపుల పాయపు పడుచులు
నిచ్చలు కొలువగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున ఆడెడి
పచ్చల పదకపు బాలుడు || ||పరతత్వంబగు బాలుడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement