Friday, May 3, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : కాంభోజి
సముఖ ఎచ్చరిక

సముఖ ఎచ్చరిక వో సర్వేశ్వరా
అమరె నీకొలువు ప్రహ్లాద వరద || సముఖ ఎచ్చరిక ||

తొడమీద కూచున్నది తొయ్యలి ఇందిరాదేవి
బడిచెలులు సోబాన పాడేరు
నడుమ వీణ వాయించీ నారదు డల్ల వాడె
అడరి చిత్తగించు ప్రహ్లాద వరదా || సముఖ ఎచ్చరిక ||

గరుడోరగాదు లూడిగములు నీకు చేసేరు
ఇరుమేలా కొలిచేరు ఇంద్రాదులు
పరమేష్ఠి ఒకవంక పనులు విన్నవించీ
అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా || సముఖ ఎచ్చరిక ||

పొదిగొని మిమ్ము నిట్టే పూజించేరు మునులెల్ల
కదిసి పాడేరు నిన్ను గంధర్వలు
మదమున అహోబలమునను శ్రీ వేంకటాద్రిని
అదె చిత్తగించుము ప్రహ్లాదవరద || సముఖ ఎచ్చరిక ||

Advertisement

తాజా వార్తలు

Advertisement