Sunday, May 19, 2024

అన్నమయ్య కీర్తనలు : చెప్పరాని మహిమల

ప చెప్పరాని మహిమల శ్రీదేవు డితడు
కప్పి కన్నుల పండుగగా జూడరో చెప్పరాని

చ అద్దుచు కప్పుర ధూళి యట్టెమేన నలదగా
వొద్దిక దేవుని భావమూహించితేను
ముద్దులు విరిసినట్టి మంచి బాలకృష్ణునికి
ముద్దుల కాంతి మేన మలసినట్టుండె చెప్పరాని

చ అమర తట్టుపుణుగు అవధరించగాను
తమితో పోలికలెల్ల దచ్చిచూడగా
యమునానది నాగేట నండ దీసుకొనగా
యమునానది నలుపు అంటిన యట్టుండే చెప్పరాని

చ అంగములు శ్రీ వేంకటాధిపున కింతటాను
సింగారించి సొమ్ములెల్ల చెలరేగగా
బంగారపు టలమేలుమంగ నురాననుంచగా
బంగారము మేనెల్లా బరగినట్టందె చెప్పరాని ెె

Advertisement

తాజా వార్తలు

Advertisement