Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : కట్టెదుర

రాగం : హిందోళము

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ || కట్టెదుర ||

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ
గాదివి బ్రహ్మాది లోకముల కొనల కొండ
శ్రీ దేవుడుండేటి శేషాద్రి యీకొండ || కట్టెదుర ||

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వితపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి యీ పొడివాటి కొండ || కట్టెదుర ||

వరములు కొటారుగ వక్కణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
కురిసిన సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపు కొండ || కట్టెదుర ||

Advertisement

తాజా వార్తలు

Advertisement