Sunday, May 5, 2024

అనర్హమైన అలవాట్లను తొలగించడము

ముందుగా, నీ పాపాలను చూసి భయపడకు, ఎందుకంటే భగవంతుడు నిన్ను ప్రేమించడం ఎప్పుడూ మానడు.

ప్రేమ తన పిల్లల ఎదుగుదలను కొనసాగిస్తూ ఉంటుందని భగవంతుడికి తెలుసు, కనుక నువ్వు ఏంచెయ్యాలని భగవంతడు అనుకుంటున్నాడో అది ఆలోచించి దానిని చేస్తూ వెళ్లు.

‘చెయ్యడానికి ప్రయత్నిస్తాను’ అన్నది పని చెయ్యదు, ప్రయత్నం ప్రతిఫలాన్ని ఇవ్వదు. ప్రయత్నం మనసులోపల నుండి వచ్చి, ఎక్కడ మార్పు అవసరము అన్న విషయముపై గుహ్యమైన అవగాహన ఉన్నప్పుడే భగవంతుని సహాయము లభిస్తుంది.

భగవంతుడి ముందు కూర్చొని అతడిని క్షమాపణ కోరుకో. అతడు ఎలాగైనా అది ఇస్తాడు. ఆ తర్వాత నీ అనుభవాలను ఇతరులతో నిరంతరాయంగా పంచుకో. ఇది ఆధ్యాత్మిక ధర్మము – ఇది నీ పాత పాపాలను తీర్చేస్తుంది.

అప్పుడు నీ మనసు స్వచ్ఛంగా, తేలికగా, భగవంతుడికి ప్రియంగా అవుతుంది. మేము కూడా ఇలా కావచ్చు అని ఇతరులకు నీవు గుర్తు తెప్పిస్తూ ఉంటావు.

- Advertisement -

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement