Friday, May 3, 2024

హుజూరాబాద్‌కు మరో రూ.200 కోట్లు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవులతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు విడుదల చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు పథకానికి ప్రభుత్వం తొలి విడత రూ. 500 కోట్లు విడుదల చేసింది. సోమవారం రెండో విడతలో మరో రూ. 500 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మంగళవారం మరో 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 1200 కోట్లు కేటాయించినట్లయ్యింది.

కాగా, దళిత బంధు పథకం అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 67వేలకు పైగా ఉద్యోగాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement