Friday, April 26, 2024

జగన్ పై అడవి శేషు పొగడ్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు హీరో అడవి శేషు. ప్రభుత్వ పని చాల అద్భుతంగా ఉందని..ముఖ్యంగా దిశా యాప్ మహిళలకు రక్షణ కవచంగా మారిందని అన్నారు. విశాఖలో జరిగిన దిశ యాప్ మీద అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అడవి శేషు… మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ప్రశంస‌నీయంగా ఉన్నాయని అన్నారు.

దిశ యాప్ ని విధ్యార్ధినులు, మహిళలు, డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement