Saturday, April 27, 2024

అద్భుతాల అరిటాకు

అరిటాకు భోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేడివేడి పదార్థాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆ ఆకు మీద ఉండే పొర కరిగి అన్నంలో కలిసి మంచి సువాసనతో భోజనానికి అద్భుతమయిన రుచి రావడంతోపాటు, తినేవారి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అరిటాకులో అనేక రకాలైన విటమిన్లు వుండటం వలన మనం వేడివేడి పదార్థాలను దానిమీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందజేస్తాయి. ఎన్నో రకములైన జబ్బులను నిరోధించే శక్తి కూడా అరటాకులో ఉండటం మరో విశేషం. అంతేగాకుండా ప్రమాద కరమైన కేన్సరు మొదలగు రోగాలను నిరోధించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని ఉపయోగించడం వలన పర్యా వరణ సమస్య కూడా రాదు. ఎందుకంటే వీటి మీద భోజనంచేసి పారేసిన తరువాత మట్టిలో సులభంగా కలిసిపోతాయి. అరిటాకు మీద భోజనం పెట్టడం సాంప్రదాయంగా భావిం చే వారం కాబట్టి, ఎంత టి శ్రతువైనా ఇంటికొచ్చినప్పుడు అరి టాకులో భోజనం చేయడానికి ఎటువంటి సందేహాలు రావు. ఎందుకంటే భోజనంలో ఏరకమైన విషం కలిసినా దానిని ఇట్టే బయటపెట్టే గుణం అరిటాకుకు వుంది. తినే ఆహారంలో విష పదా ర్థమేమైనా వుంటే ఆ ఆకు వెంటనే నల్లగా మారిపోతుంది. కాబట్టి శత్రువులు కూడా ప్రశాంతంగా భోజనం చేయగలిగే లా చేస్తుంది. ఇటువంటి విశేష గుణాలున్నది కాబట్టే అరిటాకు వేసి భోజనం వడ్డించడానికి, అందులో తినడానికి భోజన ప్రియులు ఆరాటపడు తుంటారనడంలో సందేహం లేదు. భయం కరమైన విష సర్పాలు అరటి చెట్ల దరిదాపులకు రావు. అరిటాకు లో వున్న ఔషధ గుణాల వల్ల వాటిలో వుండే విషప్రభావ తీవ్రత చాలావరకు తగ్గే అవకాశం వుంది. అందుకే ముంగీసలు అరటితోటల్లో నివాసం వుంటాయి.
– చివుకుల రాఘవేంద్రశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement