Tuesday, July 27, 2021

రేపు ఎల్లుండి ఓయులో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు..

కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో ఓయూలో వ్యాక్సినేష‌న్ క్యాంపు నిర్వహించనున్నారు అధికారులు. ఆర్ట్స్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఈ క్యాంపును నిర్వ‌హించ‌నున్నారు. యూనివ‌ర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థుల‌కు క‌రోనా టీకా ఉచితంగా వేయ‌నున్నారు. అయితే టీకా వేసుకునేందుకు వ‌చ్చే ఉద్యోగులు, విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్‌కార్డుతో పాటు వ‌ర్సిటీ జారీ చేసిన ఐడీ కార్డును తీసుకురావాల‌ని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: RRR @ మేకింగ్ వీడియో మాములుగా లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News